సీఎం రాజీనామా చేస్తే.. నేనూ చేసేస్తా!!

Updated By ManamWed, 03/21/2018 - 14:57
Chandrababu

Somu veerraju

అమరావతి: తన ఎమ్మెల్సీ పదవికి సోము వీర్రాజు రాజీనామా చేస్తారని వస్తున్న వార్తలపై ఎట్టకేలకు ఆయన మీడియా ముందుకొచ్చి క్లారిటీ ఇచ్చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాజీనామా చేస్తే.. మరో క్షణమే తాను కూడా రాజీనామా చేసేస్తానని ఆయన తేల్చిచెప్పేశారు. టీడీపీ-బీజేపీ కలిసి పోటీచేసి అధికారంలోకి వచ్చాం గనుక... సీఎంతో పాటు అందరూ రాజీనామాలు చేస్తే తాను కూడా సిద్ధంగా ఉన్నానని మరోసారి సోము వీర్రాజు స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల కోటాలో తాను ఎమ్మెల్సీగా ఎన్నికయ్యానని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

English Title
I Am Ready To Resign.. Said MLC Somu Veerraju
Related News