చనిపోయేముందు గాంధీ 'హేరామ్' అనలేదా..?

Updated By ManamWed, 01/31/2018 - 07:24
Gandhi

Kalyanamనాథూరాం గాడ్సే తుపాకీ తూటాకు బలైన మహాత్మగాంధీ నేలకొరిగే ముందు 'హే రామ్' అనలేదని దశాబ్దం క్రితం గాంధీ సహాయకుడు వెంకిట కల్యాణం అన్న విషయం తెలిసిందే. అప్పట్లో అతడి మాట సంచలనం సృష్టించగా.. తాజాగా ఆ వివాదంపై స్పందించారు కల్యాణం. గాంధీజీ చనిపోయే ముందు 'హే రామ్' అన్నారో లేదో తనకు తెలీదని అన్నారు. ఆ విషయమే తాను చెప్పానని పేర్కొన్నారు.

గాంధీజీ 'హే రామ్' అనలేదని తాను ఎప్పుడూ చెప్పలేదని.. కానీ 'హే రామ్' అని అనడం తాను వినలేదని మాత్రమే చెప్పానని అన్నారు. గాంధీజీపై కాల్పుల జరిగిన సమయంలో అక్కడ అంతా గందరగోళమైన పరిస్థితి నెలకొందని, అక్కడున్న అందరూ అరుస్తున్నారని.. అందుకే గాంధీజీ ఏమన్నారో తనకు వినిపించలేదని చెప్పారు. అయితే 1943లో గాంధీజీ దగ్గర సహాయకుడిగా చేరిన కల్యాణం, గాంధీ మరణం వరకు అతడి వద్దే ఉన్నారు.

English Title
I did not hear Bapu say 'Hey Ram'
Related News