నేను, చైతన్య పోటీ పడతామనుకోలేదు

Updated By ManamWed, 09/12/2018 - 02:05
samantha

సమంత ప్రధాన పాత్రలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్, వివై కంబైన్స్ పతాకాలపై పవన్‌కుమార్ దర్శకత్వంలో శ్రీనివాస్ చిట్టూరి, రాంబాబు బండారు నిర్మించిన చిత్రం ‘యూ టర్న్’. ఈ చిత్రంలో అది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక కీలక పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ సమంత చిత్ర విశేషాలను తెలియజేస్తూ ‘‘లూసియా’ సినిమా నుండి డైరెక్టర్ పవన్‌కుమార్ నాకు బాగా తెలుసు. మంచి స్క్రిప్ట్ ఉంటే నేను నటిస్తానని కూడా చెప్పాను. కానీ తను మరచిపోయి ‘యూ టర్న్’ సినిమాను కన్నడలో కమిట్ అయిపోయారు.

కన్నడంలో సినిమా రిలీజై సక్సెస్ అయిన తర్వాత తెలుగు, తమిళంలో సినిమా చేయడానికి సిద్ధమయ్యాను. ఈ సినిమాలో నా హెయిర్ స్టయిల్ ఎంతో మార్చాల్సిన అవసరం ఏర్పడింది. దాంతో అంతకు ముందున్న కమిట్‌మెంట్స్ అన్నీ పూర్తి చేసిన తర్వాత ‘యూ టర్న్’ను తెలుగు, తమిళంలో రీమేక్ చేయడానికి రెడీ అయ్యాను. ఈ సినిమాలో నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను. చిన్మయిని కాదని డబ్బింగ్ చెప్పడానికి ప్రత్యేకమైన కారణమేమి లేదు కానీ.. తమిళంలో నా పాత్రలకు నేనే డబ్బింగ్ చెప్పుకుంటున్నాను. తెలుగులో కూడా డబ్బింగ్ చెప్పుకుని ఓ కంప్లీట్ యాక్టర్ అనిపించుకోవాలని ఉద్దేశమే. చైతు సినిమాను ముందుగా ఆగస్ట్ 31న విడుదల చేయాలని అనుకున్నారు. కొన్ని కారణాలతో కుదరలేదు. దాంతో వాళ్లు రెండు వారాలు సెప్టెంబర్ 13కి వస్తున్నారు. మేం ముందు నుండే సెప్టెంబర్ 13న సినిమాను రిలీజ్ చేయాలనుకున్నాం.

image


అయితే నేను, చైతన్య పోటీ పడతామని అనుకోలేదు. మా రెండు సినిమాలు ఒకేసారి విడుదలవుతుంటే చిన్నపాటి టెన్షన్ ఉన్నమాట వాస్తవమే. అయితే... ఎంతైనా నా భర్తగా చైతన్య సక్సెస్‌ను నేను కోరుకుంటాను. తన సక్సెస్ తర్వాతే నాకు అన్నీ. ఒకప్పటితో పోల్చితే నాకు ఇప్పుడు బలం ఇంకా పెరిగింది. చైతన్య నాకు అండగా నిలబడుతున్నాడు.

image


 నేను సినిమాల్లో నటిస్తూ సినిమాలను నిర్మించలేను. అయితే నేను సినిమాలకు నిర్మాతగా మారుతాను. కానీ అందుకు ఇంకా సమయం ఉంది. ఫ్యూచర్‌లో మంచి కంటెంట్ ఉన్న సినిమాలను నిర్మిస్తాను. ‘యూ టర్న్’ తర్వాత చైతన్యతో కలిసి శివ నిర్వాణ సినిమాలో నటించబోతున్నాను. అలాగే మరో సినిమా కూడా ఓకే అయ్యింది. త్వరలోనే దాని వివరాలను తెలియజేస్తాను’’ అన్నారు.

English Title
i never thought to compete with chaithu
Related News