అనుష్క శెట్టి, సాయిపల్లవిలా చేయాలి- పాలక్

Updated By ManamMon, 02/19/2018 - 21:16
palak

palakరంజిత్, పాలక్ లల్వానీ జంటగా నటించిన చిత్రం ‘జువ్వ’. త్రికోటి దర్శకుడు. భరత్ సోమి నిర్మాత. ఫిబ్రవరి 23న సినిమా విడుదలవుతోంది.

ఈ సందర్భంగా హీరోయిన్ పాలక్ లల్వానీ మాట్లాడుతూ‘‘’అబ్బాయితో అమ్మాయి’ సినిమా తర్వాత దర్శకుడు త్రికోటిగారు నన్ను ఈ సినిమా కోసం సంప్రదించారు. కథ వినగానే బాగా నచ్చింది. ‘జువ్వ’లో నెక్స్‌ట్ డోర్ అమ్మాయిగా కనపడతాను. సింపుల్‌గా ఉంటుంది. హీరో రంజిత్ మంచి కో-స్టార్. సినిమా ప్రారంభం నుండి పూర్తి అయ్యేటప్పటికీ పెర్‌ఫార్మెన్స్ పరంగా ఎంతో ఇంప్రూవ్ అయ్యాడు. సినిమా జయాపజయాలు నటులపై ప్రభావాన్ని చూపవని అనుకుంటాను. అనుష్క శెట్టి, సాయిపల్లవి చేసేటువంటి డిఫరెంట్, స్ట్రాంగ్ క్యారెక్టర్స్‌ను చేయాలనుకుంటున్నాను. అయితే ప్రస్తుతం నేను ప్రారంభ దశలోనే ఉన్నాను. హీరోయిన్‌గా మంచి పొజిషన్‌కు చేరుకున్న తర్వాత మంచి పాత్రలను ఎంచుకోవడానికి ప్రయత్నిస్తాను. ప్రస్తుతం నా దర్శకులను నమ్మే సినిమాలు చేస్తున్నాను. ప్రస్తుతం జి.వి.ప్రకాష్‌తో ఓ సినిమాను, ‘కేరింత’ ఫేమ్ విశ్వాంత్‌తో మరో సినిమాను కూడా పూర్తి చేశాను. వాటి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అన్నారు. 

English Title
i want to do like anushka, sai pallavi - palak lalwani
Related News