తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

Updated By ManamTue, 08/28/2018 - 20:59
IAS Tranfers, Telangana govt, 11 districts collectors

IAS Tranfers, Telangana govt, 11 districts collectorsహైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకేసారి 11 జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ముందస్తు ఎన్నికల ఊహాగానాలతో ఐఏఎస్‌ల బదిలీలు జరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఐఏఎస్‌లను బదిలీ చేసి మరో జిల్లాకు కలెక్టర్లుగా బాధ్యతలు అప్పగించింది. హైదరాబాద్ కలెక్టర్‌గా రఘునందన్ రావు బదిలీ కాగా, రంగారెడ్డి కలెక్టర్‌గా లోకేశ్ కుమార్ బదిలీ అయ్యారు.

సిరిసిల్ల రాజన్న జిల్లా కలెక్టర్‌గా వెంకట్రామిరెడ్డి, వరంగల్ అర్బన్ కలెక్టర్‌గా పాటిల్ ప్రశాంత్ జీవన్, సిద్దపేట జిల్లా కలెక్టర్‌గా కృష్ణభాస్కర్, కొమురంభీం అసిఫాబాద్ జిల్లా కలెక్టర్‌గా ఆర్‌జీ హన్మంతు, ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా ఆర్‌వీ కర్ణన్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌గా వి.వెంకటేశ్వర్లు, సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఎం. హన్మంతరావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌గా అమోయ్ కుమార్ బదిలీ అయ్యారు.

అయితే ప్రస్తుతం హైదరాబాద్ కలెక్టర్‌గా ఉన్న యోగితారాణి కుటుంబ సంక్షేమ డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు. వరంగల్ అర్బన్ కలెక్టర్ అమ్రపాలి బదిలీ కాగా, ఆమెకు ఇంకా ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వలేదని సమాచారం. 

English Title
IAS officers Transfered by Telangana govt for 11 districts at once 
Related News