ఆర్జీవీపై హెచ్చార్సీలో ఫిర్యాదు

Updated By ManamWed, 01/31/2018 - 07:47
భారత ప్రజా తంత్ర మహిళా సంఘం

Case File On RGVహైదరాబాద్: సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ (జీఎస్టీ) మూవీ లేనిపోని చిక్కులు తెచ్చిపెడుతోంది. ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ కాకమునుపు  మహిళా సంఘాలు, బీజేపీ మహిళా నేతలు, సామాజిక కార్యకర్తలు ఆర్జీవీపై కేసులు పెట్టి, పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆఖరికి తెలంగాణ పోలీసులు నోటీసులు కూడా ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే తాజాగా కేసులు, నోటీసులు అవన్నీ పక్కనపెట్టి ఏకంగా ఈసారి హెచ్చార్సీలో ఫిర్యాదు చేయడం జరిగింది. సోషల్ మీడియా, టీవీ చానెల్స్ వేదికగా మహిళలపై వర్మ చేసిన వివాదస్పద వ్యాఖ్యలు, ఆయన ప్రసంగాలు హెచ్చార్సీ దాకా వెళ్లాయి.

               భారతీయ మహిళల గురించి చులకనగా మాట్లాడుతూ, యువతను పక్కదారి పట్టించేలా సెక్స్ ప్రసంగాలు చేస్తున్నఆర్జీవీపై కఠిన చర్యలు తీసుకోవాలని భారత ప్రజా తంత్ర మహిళా సంఘం (ఐద్వా) సభ్యురాలు పి.మణి మంగళవారం సాయంత్రం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌(హెచ్చార్సీ)లో ఫిర్యాదు చేశారు. గత మూడు నెలలుగా టీవీ చానెల్స్ ఇంటర్వ్యూలకు హాజరైన ఆర్జీవీ దేశ సంప్రదాయాలు, కట్టుబాట్లకు విరుద్ధంగా యువతను రెచ్చ గొట్టే విధంగా మాట్లాడుతున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.  స్త్రీ జాతిని అవమాన పర్చేలా వ్యాఖ్యలు చేసిన రాంగోపాల్‌వర్మపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. 
       
    అయితే ఇప్పటికే వర్మపై నమోదైన పలుకేసులు నమోదవ్వగా వాటన్నింటినీ ఏ మాత్రం లెక్కచేయకుండా తన పంథాలో తాను నడుచుకుంటున్నాడు. అయితే ఈ సారి ఏకంగా తన వ్యవహారం హెచ్చార్సీ దాకా వెళ్లిందంటే ఈ విషయంపై ఎలా స్పందిస్తారో. కాగా ఇప్పటికే సామాజిక కార్యకర్త దేవి తనను అసభ్య పదజాలంతో దూషించాడని కేసు పెట్టారు. కాగా తన మూవీ రిలీజ్ అయిన అనంతరం ఆమెకు కౌంటరిస్తూ చూశారా.. దేవీగారు! జీఎస్టీ ఎంతమంది చూశారో అంటూ చిన్నపాటి మ్యాప్‌‌ను పెట్టి సోషల్ మీడియాలో హడావుడి చేసిన విషయం తెలిసిందే. ఐద్వా సభ్యురాలు పి.మణి విషయంలో వర్మ ఏవిధంగా స్పందిస్తాడో వేచి చూడాల్సిందే.

English Title
IDWA File complaint Against film ‘GST’, Ram Gopal Varma in trouble
Related News