'అసెంబ్లీని రద్దు చేస్తే.. ఆరు నెలల్లో ఎన్నికలు..'

Updated By ManamSun, 08/26/2018 - 21:00
Telangana Assembly, elections, 6 months, TRS MP Vinod

Telangana Assembly, elections, 6 months, TRS MP Vinodన్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీని రద్దు చేస్తే ఆరు నెలల్లో తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించాలని టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌ కుమార్‌ చెప్పారు. ఢిల్లీలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీని రద్దు చేసిన పక్షంలో 6 నెలల్లో ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. జమిలీ ఎన్నికలు వస్తున్నాయని ఎన్నికలు పొడిగించడానికి వీల్లేదన్నారు. ముందస్తు ఎన్నికలపై చర్చ జరుగుతున్నది వాస్తవమేనని స్పష్టం చేశారు. కానీ ఎన్నికల కమిషన్‌ తుది నిర్ణయం తీసుకోవాలన్నారు.

సోమవారం నితిన్‌ గడ్కరీని సీఎం కేసీఆర్‌ కలుస్తారని చెప్పారు. సీఈసీ సమావేశానికి టీఆర్‌ఎస్‌ తరపున తాను హజరుకానున్నట్టు ఎంపీ వినోద్ తెలిపారు. కాగా, సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయి రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు, పలు అంశాలపై చర్చించిన సంగతి తెలిసిందే. 

English Title
If Assembly cancelled would come election with in 6 months, says TRS MP Vinod
Related News