కోహ్లీ లేకపోయినా టీమిండియా ఉత్తమ జట్టే

Updated By ManamTue, 09/18/2018 - 23:51
sarfaraj

imageఆసియా కప్ టోర్నీలో ఇండియా, పాకిస్థాన్ జట్లు బుధ వారం తలపడ నున్నాయి. ఇంగ్లాండ్‌లో ఎడతెరిపిలేని మ్యాచ్‌లు ఆడటం.. తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు టీమిండియా వెళ్లాల్సి వుండటం వంటి కార ణాలతో రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఆసియా కప్‌కు విశ్రాంతినిచ్చారు. అయితే కోహ్లీ లేకపోయినప్పటికీ రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఉత్తమమైందని పాకిస్థాన్ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నాడు.

కోహ్లీ లేకపోవడం టీమిండియాపై ఎలాంటి ప్రభావమూ చూపదని చెప్పాడు. ‘టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రపంచ ఉత్తమ బ్యాట్స్‌మన్ అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. అయితే కోహ్లీ లేకపోయినప్పటికీ టీమిండియా ఉత్తమమైన జట్టే. జట్టుకు విజయాలను కట్టబెట్టే ఆటగాళ్లు టీమిండియాలో ఉన్నారు. కనుక కోహ్లీ లేకపోవడం అనేది టీమిండియాలో ఎలాంటి ప్రభావమూ చూపదని భావిస్తున్నాను. వాళ్ల బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా ఉంది. కనుక ఇది ఒక మంచి మ్యాచ్ అవుతుందని చెప్పగలను’ అని సర్ఫరాజ్ అహ్మద్ అన్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో టీమిండి యాపై గెలుపు ఈ మ్యాచ్‌లో ప్రభావం చూపదని చెప్పాడు. 

English Title
If Kohli is not there, the best match for the team
Related News