మళ్లీ మోదీ వస్తే.. దేశంలో రాష్ట్రపతి పాలనే..!

Updated By ManamSun, 02/11/2018 - 14:02
Narendra Modi, returns to power, President’s rule, Hardik Patel
  •  దేశాన్ని విడదీసే శక్తిని ఎదుర్కొనేందుకు అన్నిపార్టీలు ఏకం కావాలి 

Narendra Modi, returns to power, President’s rule, Hardik Patelకోల్‌కతా: 2019 లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దేశంలో రాష్ట్రపతి పాలన చూడాల్సి వస్తుందని పాటీదార్‌ ఉద్యమనేత హార్దిక్ పటేల్ వ్యాఖ్యానించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మోదీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే ఎన్డేయేతేర ప్రభుత్వాలన్నీ విచ్ఛిన్నమవుతాయనే ఉద్దేశంతో పటేల్ ‘రాష్ట్రపతి పాలన’ అనే పదాన్ని వాడినట్టు తెలుస్తోంది. దేశాన్ని విడదీసేందుకు యత్నిస్తున్న శక్తిని ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలు ఐకమత్యంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని నొక్కిచొప్పారు. ‘2019 లోక్‌సభ ఎన్నికల తరువాత నరేంద్ర మోదీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే.. దేశంలో రాష్ట్రపతి పాలనను స్వాగతించినట్టే అవుతుందని నేను స్పష్టంగా చెప్పాను’ అని కోల్‌కతాలో శనివారం ఓ స్థానిక మీడియాకు పటేల్ వెల్లడించారు. ‘దేశాన్ని విడగొట్టేందుకు యత్నిస్తున్న శక్తికి వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలిసి పోరాడాల్సిన అవశ్యకత ఉంది’ అని స్పష్టం చేశారు. ఇటీవల మోదీ పార్లమెంట్‌లో ప్రతిపక్షాలపై చేసిన వ్యాఖ్యలను పటేల్ తప్పుబట్టారు.

అలాంటి ప్రధాని మాకొద్దు...
‘విద్య, ఉద్యోగం, వ్యవసాయం, ఆరోగ్యం, భద్రత, రక్షణ.. పలు సమస్యలపై మాట్లాడే దేశ ప్రధానమంత్రిని నేను చూడాలనుకుంటున్నాను. కానీ, పార్లమెంట్‌లో 90 నిమిషాల ప్రసంగంలో కేవలం ప్రతిపక్షాన్ని మాత్రమే విమర్శలు చేయడానికే కేటాయించారు. అటువంటి ప్రధానమంత్రిని నేను కావాలనుకోవడం లేదు’ అని హార్దిక్ పటేల్ మోదీపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. శనివారం తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కలిసిన పటేల్.. ఆమెను పొగడ్తలతో ముంచేత్తారు. ఇటీవల కోల్‌కతాలోని సచివాలయంలో జరిగిన సమావేశంలో ఆమె నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, టీఎంసీ సుప్రీమో మమత ‘లేడీ మహాత్మా’ అంటూ హార్దిక్ పటేల్ అభివర్ణించారు.

English Title
If Modi returns to power, country will see President’s rule, says Hardik Patel
Related News