ఓర్పు వహించకపోతే ఇబ్బందులే

Updated By ManamTue, 03/13/2018 - 01:45
rbi
  • సవరించిన ఎన్.పి.ఎ పరిష్కార 

  • నిబంధనావళిని సడలించాలని 

  • ఆర్.బి.ఐకి విజ్ఞప్తి చేసిన బ్యాంకులు

RBIముంబయి: ‘స్రెస్సడ్ ఎసెట్ల’ పరిష్కారానికి సవరించిన నిబంధనావళిని సడలించవలసిందిగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్.బి.ఐ)కి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. రుణం తిరిగి చెల్లించడంలో ఒక్క రోజు జాప్యం చేసినా సహించకపోవడమనే బ్యాంకింగ్ రంగ నియంత్రణ సంస్థ వైఖరి, ప్రభుత్వానికి ప్రాధాన్యతా రంగంగా ఉన్న మౌలిక వసతుల రంగానికి రుణాల మంజూరుకు తీవ్ర భంగం కలిగించవచ్చని పేర్కొంది. రుణాన్ని తిరిగి చెల్లించడంలో ఒక్క రోజు జాప్యం జరిగినా భారీ రుణాల కేంద్ర సమాచార భాండాగారం (సి.ఆర్.ఐ.ఎల్.సి)కి ఆ రుణ ఎగవేత ఖాతా గురించి నివేదించడంలో బ్యాంకులకు ఎలాంటి అభ్యంతరం లేదని అసోసియేషన్ వెల్లడించింది. (ఎగవేత చోటుచేసుకున్న మొదటి రోజున కాకుండా) రుణ పునర్నిర్మాణంతో ముడిపడిన ఖాతా పరిష్కార ప్రక్రియ 60 రోజుల తర్వాత మొదలు కావాలని మాత్రమే తాము కోరుతున్నామని అసోసియేుషన్ స్పష్టం చేసింది.  ‘స్రెస్సడ్ ఎసెట్ల’ పరిష్కారానికి సవరించిన నిబంధనావళిని ఫిబ్రవరి 12న ప్రకటించారు. దానిలో ఎగువ పేర్కొన్న సడలింపును తీసుకురావలసిందని కోరడానికి కారణం 

మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులు విచిత్రంగా నగదు ప్రవాహ సవుస్యలను ఎదుర్కొంటూండడవేునని లేదా వాటికి రావలసిన బకాయిలలో జాప్యాలు చోటుచేసుకుంటూండడవేునని అసోసియేుషన్ వివరించింది. ‘‘సాధారణంగా కొన్ని కంపెనీలు (ఆసలు లేదా వడ్డీ చెల్లింపులో) 3-40 రోజుల జాప్యం చేస్తూంటాయి. కానీ, తర్వాత, రుణ ఖాతాను క్రవుబద్ధం చేస్తాయి. కనుక, అవి ‘నయం’ కావడానికి 60 రోజుల గడువు ఇవ్వాలి. అవి 60వ రోజున కూడా ఏమీ చెల్లించలేక, ఖాతాను క్రమబద్ధం చేసుకోకపోతే, అప్పుడు పునర్నిర్మాణాన్ని ప్రారంభించవచ్చు’’ అని ఉన్నత స్థాయి ప్రభుత్వ రంగ బ్యాంకర్ ఒకరు చెప్పారు. 

ఎగవేసిన మొదటి రోజునే పునర్నిర్మాణ ప్రక్రియను మొదలెడితే, ఖాతా స్థాయిని వెంటనే తగ్గించి, నిరర్థక ఆస్తి (ఎన్.పి.ఎ) కేటగిరీలోకి చేర్చాల్సి ఉంటుందని, దానివల్ల ప్రొవిజనింగ్ పర్యవసానాలు ఏర్పడతాయని అసోసియేుషన్ తెలిపింది. ‘స్రెస్సడ్ ఎసెట్ల’ పరిష్కారానికి సంబంధించి పూర్వపు ఆదేశాలన్నింటినీ ఆర్.బి.ఐ రద్దు చేసి, వాటి స్థానంలో సవరించిన నిబంధనావళిని తెచ్చింది. ఓర్పు ముఖ్యంగా ఒకప్పటి వ్యూహాత్మక రుణ పునర్నిర్మాణ (ఎస్.డి.ఆర్) పథకం కింద చేపట్టే పునర్నిర్మాణ ఖాతాల విషయంలో అవసరమని బాంయకర్లు అభిప్రాయపడుతున్నారు. ‘‘ఉదాహరణకు, ఎస్.డి.ఆర్ పథకం కింద, స్ట్రెస్సడ్ కంపెనీ రుణాన్ని రుణ దాతలు ఈక్విటీగా మార్చేశారనుకుందాం. ఇంతకుముందైతే, అలా మార్చిన తర్వాత, ఆ పథకం కింద మేనేజ్‌మెంట్ మారడానికి 12 నెలల వ్యవధి ఉండేది. కానీ, స్ట్రెస్సడ్ ఆస్తుల పరిష్కారానికి సంబంధించి అన్ని పథకాలను మార్చి 1 నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్.బి.ఐ హఠాత్తుగా ప్రకటించింది. ఆ ఖాతాలు ఎన్.పి.ఏలుగా పరిణమిస్తాయని పేర్కొంది’’ అని మరో బ్యాంకర్ చెప్పారు. 

ఆర్థిక వృద్ధి అంచనాలు
ఆర్థిక సర్వే 2018-19 ఆర్థిక సంవత్సరంలో జి.డి.పి వృద్ధి 7-7.5 శాతంగా ఉండగలదని అంచనా వేసింది. దేశం 8 శాతైంపెనే వృద్ధి సాధించే బాటలో దేశం ఇప్పుడు స్థిరంగా సాగుతోందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రంగంలో కూడా పేర్కొన్నారు. బ్యాంకులు మౌలిక వసతుల కల్పన రంగానికి చేయూత నిస్తేనే, ఆ అంచనాలు వాస్తవ రూపం ధరిస్తాయని బ్యాంకర్లు అంటున్నారు. దీనికోసం, నియంత్రణదారు దాని మార్గదర్శక సూత్రాల విషయంలో కొంత సడలింపు నివ్వాల్సిన అవసరం ఉందని వారు చెబుతున్నారు. ‘‘మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులు అంతర్గతంగా జాప్యాల రిస్కును ఎదుర్కొంటూ ఉంటాయి. ఎందుకంటే, వాటి ఫలాలు రావడానికి చాలా కాలం పడుతుంది. ఈలోగా ఏమైనా జరగవచ్చు. చాలా సందర్భాల్లో, ఈ జాప్యం (చట్టబద్ధమైన అనుమతులు ఇవ్వడంలో జాప్యాల వంటివి) ప్రభుత్వం వైపు నుంచే ఉంటోంది తప్ప, ప్రమోటర్ వైపు నుంచి కాదు. కనుక, ఈమాత్రమైనా ఆర్.బి.ఐ సహనం చూపకపోతే, మౌలిక వసతుల కల్పన రంగానికి రుణా లివ్వడం బ్యాంకులకు కొద్ది రిస్కుతో కూడుకున్న వ్యవహారంగా మారుతుంది. మౌలిక వసతుల కల్పన రంగానికి రుణాలు సమకూర్చడంలో ప్రభుత్వం తీవ్ర సమస్యను ఎదుర్కోవచ్చు’’ అని ఆ ఉన్నత స్థాయి ప్రభుత్వ రంగ బ్యాంకర్ వివరించారు. 

ఆర్థిక వృద్ధిని, సమాజ సంక్షేమాన్ని మెరుగుపరచేందుకు మౌలిక వసతులను అభివృద్ధి చేయుడానికి భారతదేశానికి 2040 వరకు దాదాపు 4.5 ట్రిలియన్ల డాలర్ల విలువైన పెట్టుబడి అవసరమవుతుందని ఆర్థిక సర్వేలో తెలిపారు. ప్రస్తుత ధోరణి ఆ 4.5 ట్రిలియన్ల డాలర్లలో దాదాపు 3.9 ట్రిలియన్ల డాలర్లు మాత్రమే సమకూరవచ్చని సూచిస్తోంది. 

సహనం చూపండి
తొలుతటి స్ట్రెస్సడ్ ఎసెట్ రిజల్యూషన్ స్కీముల కింద ఇప్పటికే చేపట్టిన ఖాతాల పునర్నిర్మాణ విషయంలో, పునర్నిర్మాణ ప్రక్రియను పూర్తి చేసేందుకు 180 రోజులు సహనం చూపవలసిందిగా అసోసియేుషన్ కోరింది. స్ట్రెస్సడ్ ఆస్తుల పరిష్కార సవరించిన నిబంధనావళి కింద ఒక ఖాతా ఎన్.పి.ఏగా పరిణమిస్తే, దాన్ని అప్‌గ్రేడ్ చేయడం దాదాపు అసాధ్యం కనుక మేం ఓర్పు వహించవలసిందని కోరుతున్నాం. నూతన మార్గదర్శక సూత్రాల కింద, అసలులో కనీసం 20 శాతం తిరిగి చెల్లిస్తే తప్పించి ఖాతాను అప్‌గ్రేడ్ చేయడానికి లేదు. దానికి కనీసం 3-4 ఏళ్ళు పడుతుంది. కనుక ఖాతా అప్‌గ్రేడింగ్ కుదరని అంశంగానే మిగిలిపోతుంది’’ అని ఆ బ్యాంకర్ పేర్కొన్నారు.

Tags
English Title
If you do not endure patience
Related News