రిటైల్ బాండ్‌లు తిరిగి చెల్లించనున్న ఐఐఎఫ్‌ఎల్

Updated By ManamSun, 09/23/2018 - 22:42
iifl

iiflముంబై: వడ్డీతో సహా రూ. 553 కోట్ల రిటైల్ బాండ్లను ఈ నెలలోనే తిరిగి చెల్లించన్నుట్లు ఐఐఎఫ్‌ఎల్ ఫినాన్స్ ఇటీవల ప్రకటించింది.  వడ్డీ రేట్లు పెరగడంతో కంపెనీ 2013 సెప్టెంబర్‌లో రిటైల్ బాండ్లను జారీ చేసింది. ‘‘మేము 2013లో వడ్డీ రేట్టు అధికంగా ఉన్నప్పుడు రిటైల్ బాండ్లను జారీ చేశాము. ప్రస్తుతం వాటిని తిరిగి చెల్లించనున్నాం ’’ అని సంస్థ చీఫ్ ఫినాన్షియల్ అధికారి ప్రబోద్ అగర్వాల్ అన్నారు. ఇది ఐఐఎఫ్‌ఎల్ హోల్డింగ్స్ కింద నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీగా పని చేస్తుంది. అది గృహ, వ్యాపార. బంగారు, వాణిజ్య వాహనాలు, మైక్రో-ఫినాన్స్‌లకు రుణాలందిస్తుంది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 24,000 కోట్లుగా ఉంది.

Tags
English Title
IFL to repay retail bonds
Related News