వాటికి భయపడను

Updated By ManamTue, 09/11/2018 - 00:36
pooja hegde

తెలుగులో ప్రభాస్ సినిమా, మహేశ్ ‘మహర్షి’, ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ సినిమాలతో పాటు బాలీవుడ్‌లో అక్షయ్‌కుమార్‌తో ‘హౌస్‌ఫుల్ 4’ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్న హీరోయిన్ పూజా హెగ్డే. రెండు భాషల్లో నటించడానికి క్షణం తీరిక లేకుండా పరుగులు తీస్తుందీ అమ్మడు. ‘‘జయాపజయాలకు సంబంధం లేకుండా నేను నా పనిని ప్రేమిస్తాను. ఒక వ్యక్తి ఇంటి నుండి బయటకు వస్తే మంచి చెడులుంటాయి. చెడు జరిగినప్పుడు మాత్రమే ఏదో జరిగిపోయిందనే భావన మనలో ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఆలోచనలే తప్పు.

image


సినిమా రంగం విషయానికి వస్తే జయాపజయాలనేవి అందరికీ కామన్‌గా ఉంటాయి. కాబట్టి వాటి గురించి నేను భయపడను. ఫెయిల్యూర్ ఎదురైంది కదా! అని చెప్పి ఆలోచిస్తే కష్టం. అలాంటి వ్యక్తులు బయటకు రాకుండా ఉండటమే ఉత్తమం. ఫెయిల్యూర్స్‌ను కూడా ఫేస్ చేసేంత మానసిక ధైర్యం ఉన్నప్పుడే బయటకు రావాలి.  ప్రస్తుతం నా కోస్టార్స్‌లో ఒకరైన అక్షయ్‌కుమార్‌గారితో కలిసి నటించడం ఆనందంగా ఉంది. ఆయన దగ్గర నుండి వృత్తి పరమైన విషయాలను చాలా నేర్చుకున్నాను. ఆయనొక ఇన్‌స్పైరింగ్ పర్సనాలిటీ’’ అంటూ అక్షయ్‌ను ఆకాశానికెత్తేస్తుంది పూజా హెగ్డే.
 

image

 

English Title
il not afraid
Related News