పాక్ ఫలితాలు అధికారికంగా వెల్లడి

Updated By ManamFri, 07/27/2018 - 14:27
pak elections

pakistan elections-imran khanఇస్లామాబాద్  : పాకిస్తాన్ ఎన్నికల ఫలితాలను ఆదేశ ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. లెజెండరీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పాకిస్థాన్-తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ (పీటీఐ) అతిపెద్ద పార్టీగా అవతరించింది. పాక్ జాతీయ అసెంబ్లీలోని 272 స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు జరగగా, పీటీఐ 119 స్థానాలు కైవసం చేసుకుంది.

ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం 137 కాగా ఏపార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయక తప్పని స్థితి నెలకొంది. దీంతో ఇతరుల మద్దతుతో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. 

ఇప్పటివరకూ... ప్రకటించిన ఫలితాలు...
పీటీఐ-110
పీఎంఎల్-ఎన్-63
పీపీపీ - 42
ఇతరులు - 12
ఎంఎంఏ - 10
పాకిస్తాన్ ముస్లిం లీగ్ క్వైద్ -5
బెలుచిస్తాన్ నేషనల్ పార్టీ - 2
జీడీఏ - 2
ఎంక్యూఎం -2
అవామీ ముస్లిం లీగ్ -1
అవామీ నేషనల్ పార్టీ -1
పాకిస్తాన్ తెహ్రీక్-ఈ-ఇన్సానియత్-1

English Title
Imran Khan wins in Pakistan but needs support to form government
Related News