‘పోలవరం’ పనులు స్పీడు పెంచండి

Updated By ManamMon, 09/03/2018 - 23:40
chandra babu naidu
  • పునరావాస పనులు డిసెంబరుకు పూర్తికావాలి

  • అధికారులు, ఇంజనీర్లకు ముఖ్యమంత్రి ఆదేశం 

chandrababuఅమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగం పెంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులు, ఇంజనీర్లను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి సోమవారం నాడు 73వ వర్చ్యువల్ సమీక్ష చేశారు. వర్షాల కారణంగా గత వారం జరిగిన పోలవరం ప్రాజెక్టు పనుల జాప్యాన్ని ఈ వారం పూరించి వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. స్పిల్ వే పనులు 87 వేల క్యూబిక్ మీటర్లు జరిగిందని, జెట్ గ్రౌటింగ్ పనులు 52.5 శాతం పనులు పూర్తయ్యాయని అధికారులు సీఎంకు వివరించారు. లక్ష్యాలను చేరుకోవాలని సీఎం సూచించారు. పునరావాస పనులు డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని, ప్రాజెక్టు కన్నా ఇదే ముందు పూర్తి కావాలన్నారు. 10వ తేదీ కల్లా గేలరీ వాకింగ్ పనులు పూర్తవుతాయని అధికారులు తెలిపారు, ఏ రోజైన దానిని ప్రారంభించడానికి సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు, ముఖ్యమంత్రి కార్యదర్శి సాయిప్రసాద్, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్, ఈఎన్‌సి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

అవార్డులు ప్రగతికి చిహ్నం 
అవార్డులు ప్రభుత్వం సాధించిన ప్రగతికి నిదర్శనమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి 2016-17లో రాష్ట్రానికి 5 అవార్డులు వచ్చాయని, 2017-18లో 10అవార్డులు వచ్చాయి. ఈ ఏడాది 20 అవార్డులు సాధించాలని అధికారులకు సూచించారు. మన రాష్ట్రానికి వివిధ విభాగాల్లో 10 అవార్డులు రావడం గర్వకారణం అని, ఇందుకు కారణమైన ప్రతి ఒక్కరికీ అభినందనలు అని ముఖ్యమంత్రి చెప్పారు.

మూడు ప్రాంతాల్లో తీవ్ర వర్షాభావం..
రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తీవ్ర వర్షాభావం నెలకొందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.  నీరు-ప్రగతి, వ్యవసాయం పురోగతిపై నిర్వహించిన సమీక్షలో ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. శ్రీశైలంలో 7టిఎంసిలు, నాగార్జున సాగర్‌లో 7టిఎంసీలు, పులిచింతలలో 29టిఎంసిల నీరు చేరాల్సివుందన్నారు. మూడు రిజర్వాయర్లకు ఇంకా 43 టిఎంసిలు రావాలన్నారు. 40 వేల క్యూసెక్కుల నీటిని రాయలసీమకు పుష్ చేస్తున్నామని తెలిపారు. వర్షంతో సంబంధం లేకుండా పంట దిగుబడులు తగ్గకుండా చూడాలన్నారు. ఉద్యాన పంటల విస్తీర్ణం 33లక్షల ఎకరాల నుంచి కోటి ఎకరాలకు తీసుకెళ్లాలన్నారు. కరువు మండలాల్లో నరేగా పనులను ముమ్మరం చేయాలన్నారు. సరైన ధరకు రైతుల వద్ద ఉల్లిని కొనుగోలు చేయాలన్నారు. 

English Title
Increase speed of 'Polavaram' tasks
Related News