పెరిగిన తెలుగు పాటల డౌన్‌లోడ్‌లు

Updated By ManamWed, 03/14/2018 - 22:19
image

imageహైదరాబాద్: ఎయిర్‌టెల్ అందిస్తున్న ప్రాచుర్యం పొందిన ఓ.టి.టి మ్యూజిక్ యాప్ వింక్ మ్యూజిక్ 7 కోట్ల 50 లక్షల యాప్ ఇన్‌స్టాల్స్ వైులురాయిని దాటినట్లు బుధవారం వెల్లడించింది. సంగీత ప్రియులు చేరుకునే గమ్యస్థానంగా యాప్‌కు వృద్ధి చెందుతున్న ప్రాచుర్యాన్ని ఇది సూచిస్తోందని వింక్ మ్యూజిక్ పేర్కొంది. తెలుగు సంగీత డౌన్‌లోడ్లు పతాక స్థాయిలకు చేరుకున్నాయి. భారతదేశంలో వింక్ మ్యూజిక్ వృద్ధిలో అది కూడా ఒక కీలకాంశంగా ఉంది. లోకల్ కంటెంట్‌కు ఉన్న పటిష్టైమెన డిమాండ్ వల్ల వింక్ మ్యూజిక్‌లో మొత్తంమీద పాటల విభాగాలు దృఢైమెన వృద్ధిని చూశాయి. మొత్తంమీద బాలీవుడ్ సంగీతం రాజ్యవేులుతున్నప్పటికీ, వింక్‌పై భారతీయ ప్రాంతీయ సంగీత వాహినులు అందరి దృష్టిని ఆకర్షించి 100 శాతం పైగా వృద్ధి చెందాయి. వింక్ మ్యూజిక్‌లో 12 భారతీయ ప్రాంతీయ భాషల సినిమా పాటలతో సహా 30 లక్షలకు పైగా పాటలు ఉన్నాయి. పరిశ్రమలోని దాదాపు అన్ని కంటెంట్ ప్రొవైడర్లు, లేబుళ్ళతో దానికి వాహినీ భాగస్వామ్య హక్కులున్నాయి. అది శ్రోతలకు సాటిలేని వినోద అనుభవాన్ని అందిస్తోంది. ప్రాంతీయ కంటెంట్‌లో 100 శాతం వృద్ధిలో అధిక భాగం తమిళ, తెలుగు, పంజాబీ, కన్నడ భాషల నుంచే వచ్చింది. వింక్ మ్యూజిక్ వృద్ధి గాధలో మరో విశేషం దాని క్రియాశీల వాడకందార్లలో 13 శాతం మంది గ్రామీణ భారతం నుంచి వచ్చినవారు కావడం. మొత్తంమీద దైనందిన స్ట్రీవ్‌ులలో దాదాపు 10 శాతానికి వారు దోహదపడుతున్నారు. ఈ వినియోగదార్లు కూడా కంటెంట్ కోసం తమ స్థానిక భాషలనే ఆశ్రయిస్తున్నారు. 

English Title
Increased Telugu songs downloads
Related News