కాలరెగరేసిన సూచీలు

Updated By ManamTue, 03/13/2018 - 00:47
'Sensex'

సెన్సెక్స్ 33,900 పాయింట్ల స్థాయిని అందుకోగా, నిఫ్టీ 10,400 పాయింట్లకు ఎగసింది
'Sensex'ముంబయి
: అవెురికా ఆర్థిక వ్యవస్థపై పెరుగుతున్న ఆశావాదంతో, వాణిజ్య యుద్ధ భయాలు తగ్గుముఖం పట్టగా, గ్లోబల్ రిలీఫ్ ర్యాలీ ఇచ్చిన ఊతంతో బొంబాయి స్టాక్ ఎక్స్చెంజి (బి.ఎస్.ఇ) సున్నిత సూచి సోమవారం ఏకంగా 611 పాయింట్లు లాభపడి 33,917.94 పాయింట్ల వద్ద ముగిసింది. రెండేళ్ళ కాలంలో ‘సెన్సెక్స్’ ఒకే రోజులో ఇన్ని పాయింట్లను కూడగట్టుకోవడం ఇదే మొదటిసారి. మదుపరులు ఇటీవల ఘోరంగా దెబ్బతిన్న లోహాలు, ఆయిల్, గ్యాస్, ఎఫ్.ఎం.సి.జి, బ్యాంకింగ్, విద్యుచ్ఛక్తి, మౌలిక వసతులు, ఐ.టి. ఆటో, మూలధన వస్తువుల రంగ షేర్లను ఉత్సాహంగా కొనుగోలు చేశారు. విదేశీ ఫండ్లు స్టాక్ మార్కెట్లలోకి కొత్తగా నిధులు ప్రవహింపజేశాయి. ‘సెన్సెక్స్’ సోమవారం పటిష్టమైన స్థితిలో మొదలై  దేశీయ పంఢ్లు, రిటైల్ ఇన్వెస్టర్లు జరిపిన తాజా కొనుగోళ్ళతో 33,962.48 పాయింట్ల గరిష్ఠ స్థితిని చూసింది. అయితే, తర్వాత కొన్ని పాయింట్లను వదులుకున్నప్పటికీ, మొత్తానికి 610.55 పా యింట్ల లాభంతో ఒక వారం అ త్యధిక స్థాయి 33,917.94 పాయింట్ల వద్ద ముగిసింది. ‘సెన్సెక్స్’ ఒక దశలో 777.35 పాయింట్లు పెరిగి, 2016 మార్చి 1 తర్వాత,  ఒకే రోజులో అత్యధిక లాభ స్థితిని నమోదు చేసింది. 

నేషనల్ స్టాక్ ఎక్చ్సేంజి (ఎన్.ఎస్.ఇ) సూచి ‘నిఫ్టీ’ కూడా సోమవారం 194 పాయింట్లు పుంజుకుని 10,421.40 పాయింట్ల వద్ద ముగిసింది. యాభై కంపెనీల షేర్ల హెచ్చు తగ్గులను ప్రతిబింబించే ‘నిఫ్టీ’లో 47 కంపెనీల షేర్ల ధరలు లాభాలతో ముగిసాయి. ఇంట్రా-డేలో అది 10,433.65 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. ‘‘దృఢమైన గ్లోబల్ సంకేతాలు, దేశీయ ద్రవ్యోల్బణం సడలి 4.74 శాతంగా ఉండగలదనే ఊహలు మదుపరులను ఉత్తేజపరచి బేరం జరపడానికి ఉన్న అవకాశాన్ని వినియోగించుకునేట్లు చేశాయి. అంతర్జాతీయ వాణిజ్య యుద్ధ భయం కూడా కొద్దిగా ప్రభావం చూపినా, అవెురికా పేరోల్ డాటాలో పెరుగుదల అక్కడి ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వాన్ని సూచించింది. అది గ్లోబల్ ట్రేడ్‌ను పెంపొందించింది’’ అని జియోజీత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్‌లో పరిశోధన విభాగాధిపతి వినోద్ నాయర్ చెప్పారు. అవెురికా ఉద్యోగాల నివేదిక సానుకూలంగా ఉండడంతో ఆసియన్, యూరోపియన్ మార్కెట్లు గత వారాంతపు ర్యాలీని కొనసాగించాయి.

దూసుకెళ్ళిన కంపెనీలు
రూ. 16,500 కోట్ల రుణ రీఫైనాన్సింగ్‌కి, స్పెక్ట్రమ్ భారాల చెల్లింపునకు డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలుపడంతో భారతీ ఎయిర్‌టెల్ ‘సెన్సెక్స్’ కంపెనీల్లో అన్నింటికన్నా అత్యధికంగా 4.68 శాతం లాభపడింది. జి.ఎస్.టి కౌన్సిల్ సమావేశంలో సిగరెట్లపై రేట్లను మార్చకుండా అలానే ఉంచడంతో ఇండెక్స్‌లోని మరో అగ్ర కంపెనీ ఐ.టి.సి 4.09 శాతం పెరుగుదలను చూసింది. ఎన్.టి.పి.సి 4.33 శాతం లాభపడింది. ఎన్.టి.పి.సి లిమిటెడ్ ప్రతిపాదిత  సీనియర్ అన్‌సెక్యూర్డ్ అవెురికన్ డాలర్ల నోట్‌లకు మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ బిఏఏ2 రేటింగ్ ఇవ్వడంతో దాని షేర్ ధర చకచక పెరిగింది. దేశీయ పాసింజర్ వాహనాల అమ్మకాలు 7.77 శాతం పెరిగి ఫిబ్రవరిలో 2,75,329 యూనిట్లుగా న మో దవడంతో మోటారు వాహనాల రంగ షేర్ల ధరలు పెరిగాయి.

Tags
English Title
Indexed Indexes




Related News