భారత్ ఖాతాలో 7 స్వర్ణాలు

Updated By ManamMon, 07/16/2018 - 23:28
indian-boxers
  • మొత్తం 17 పతకాలతో అగ్రస్థానం

  • సెర్బియన్ యూత్ బాక్సింగ్ టోర్నమెంట్

indian-boxersన్యూఢిల్లీ: సెర్బియాలో జరిగిన వొజ్‌వొడినా యూత్ టోర్నమెంట్‌లో భారత్ బాక్సర్లు 7 పసిడి పతకాలను సాధిం చారు. బంగారు పతకాలు సాధించిన వారిలో ముగ్గురు మహిళ బాక్సర్లు ఉన్నారు. అంతేకాకుండా భారత్ ఈ టోర్నీలో మొత్తం 17 పతకాలు సాధించి మొదటి స్థానంలో నిలిచింది. ఇందులో మొత్తం 7 స్వర్ణ పతకాలు, 6 రజత పతకాలు, 4 కాంస్య పతకాలు ఉన్నాయి. భారత్ తరపున అమన్ (91+కిలోలు), ఆకాష్ కుమార్ (56కిలోలు), ఎస్ బరూన్ సింగ్ (49 కిలోలు), విజయ్‌దీప్ (69కిలోలు), నీతూ (48కిలోలు), దివ్యపవార్ (54కిలోలు), లలిత (69కిలోలు) విభాగాల్లో పసిడి పతకాలు గెలుపొందారు. బంగారు పతకం సాధిస్తుందనుకున్న మాజీ యూత్ ప్రపంచ చాంపియన్ జ్యోతి గులియా (51కిలోలు) విభాగంలో రజత పతకంతో సరిపెట్టుకుంది. జ్యోతితో పాటు మనీషా (64కిలోలు), నేహ యాదవ్ (81+కిలోలు), ఆకాష్ (64కిలోలు), అంకిత్,  నితిన్ కుమార్ (75కిలోలు) విభాగాల్లో రజతాలు సాధించారు. సాక్షి (51కిలోలు), సాక్షి గైదాని (81కిలోలు), భవేష్ (52కిలోలు), అనామిక (51కిలోలు) విభాగాల్లో కాంస్య పతకాలు గెలిచారు. 17పాయింట్లతో భారత్ మొదటి స్థానంలో ఉండగా, రష్యా 11పాయిం ట్లు, కజకస్థాన్ 5 పాయింట్లతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. 

English Title
India has seven golds
Related News