‘బ్రిటన్‌ను మించిపోతాం’

Updated By ManamThu, 08/30/2018 - 17:21
India Likely to Surpass Britain to Become World
arun jaitley

న్యూఢిల్లీ: భారతదేశం వచ్చే ఏడాది బ్రిటన్‌ను వెనక్కి నెట్టి ప్రపంచంలో ఐదవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని భావిస్తున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. ‘ఈ ఏడాది పరిమాణం విషయంలో, మనం ఫ్రాన్స్‌ను అధిగమించాం. వచ్చే ఏడాది మనం బ్రిటన్‌ను అధిగమించే అవకాశం ఉంది.

అంటే, మనం ఐదవ పెద్ద ఆర్థిక వ్యవస్ధగా అవతరిస్తాం’ అని ఆయన చెప్పారు. ప్రపంచంలోని ఇతర ఆర్థిక వ్యవస్థలు తక్కువ రేటుతో వృద్ధి చెందుతున్నాయని తెలిపారు. వచ్చే 10-20 ఏళ్ళలో ప్రపంచంలోని టాప్ మూడు ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా పరిణమించే సామర్థ్యం ఇండియాకు ఉందని కూడా ఆయన గురువారమిక్కడ అన్నారు. 

English Title
India Likely to Surpass Britain to Become World's 5th Largest Economy in 2019: Jaitley
Related News