మోన్‌శాంటో రాయల్టీకి కోత

Updated By ManamTue, 03/13/2018 - 21:57
Monsanto

Monsantoన్యూఢిల్లీ: మోన్‌శాంటో కంపెనీకి స్థానిక వంగడ కంపెనీలు చెల్లించే రాయల్టీలకు రెండేళ్ళలో రెండవసారి ఇండియా కోత విధించింది. ఈ దేశాన్ని విడిచిపోతామని 2016లో హెచ్చరించిన అవెురికన్ కంపెనీతో మరో వివాదానికి ఇది తెర లేపగలదని భావిస్తున్నారు. జన్యుపరంగా సవరించిన (జి.ఎం) పత్తి రూపొందించినందుకు భారతీయ వంగడ కంపెనీలు మోన్‌శాంటోకి చెల్లిస్తున్న రాయల్టీలను 20.4 శాతం తగ్గించాలని వ్యవసాయ మంత్రిత్వ శాఖ నిర్ణయించిందని కేంద్రం మంగళవారం జారీ చేసిన ఒక ఉత్తర్వులో పేర్కొంది. మోన్‌శాంటో రాయల్టీలను వ్యవసాయ మంత్రిత్వ శాఖ 2016లో 70 శాతంపైగా తగ్గించింది. అది దీర్ఘకాలిక వివాదాన్ని రేకెత్తించింది. భారత, అవెురికా ప్రభుత్వాలు కూడా సిగపట్లకు దిగవలసి వచ్చింది. ‘‘చిహ్న ఫీజులకు (రాయల్టీలకు) మరింత కోత పెడుతున్న నేటి ఉత్తర్వు దురదృష్టకరం. ఇప్పటికే అవి సేద్యపు ఖర్చులో 0.5 శాతం కన్నా తక్కువగా ఉన్నాయి. టెక్నాలజీ మాత్రం దేశమంతటా రైతులకు విలువను సమకూరుస్తూనే ఉంది’’ అని మోన్‌శాంటోకు చెందిన భారతదేశపు సంయక్త రంగ సంస్థ మహికో మోన్‌శాంటో బయోటెక్ (ఇండియా) (ఎం.ఎం.బి) ప్రతినిధి ఒకరు చెప్పారు. 

భారతదేశపు వ్యవసాయంలో పత్తిది ఒక విజయ గాధ. ఉత్పత్తి, ఎగుమతులు రెండూ ఒక్కసారిగా పెరిగాయి. కానీ, పెట్టుబడులు ఆకర్షించేందుకు ఈ రంగానికి అంచనా వేయదగిన వ్యాపార వాతావరణం అవసరమని ఆ ప్రతినిధి చెప్పారు. మోన్‌శాంటో రాయల్టీలకు కోత పెట్టడంతోపాటు జి.ఎం. పత్తి విత్తనాల ధరలను కూడా ప్రభుత్వం 7.5 శాతం తగ్గించింది. కీటకాలు తెస్తున్న తెగుళ్ళతో సతమతమవుతున్న రైతులకు సాయపడేందుకు 450 గ్రాముల విత్తనాల ప్యాకెట్‌ను రూ. 740కి విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

సరఫరాలు నిలిపేస్తామని హెచ్చరిక
భారతీయ వంగడాల సంస్థల నుంచే రైతులు జి.ఎం. పత్తి విత్తనాలు కొంటున్నారు. వాటిని ఉత్పత్తి చేయడానికి మోన్‌శాంటో యాజమాన్య టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నందుకుగాను భారతీయ వంగడాల సంస్థలు దానికి కొంత రాయల్టీ చెల్లిస్తున్నాయి. జి.ఎం పత్తి విత్తనాల ఉత్పత్తిదార్ల సంస్థ నేషనల్ సీడ్ అసోసియేుషన్ ఆఫ్ ఇండియా (ఎన్.ఎస్.ఎ.ఐ). వంగడాల ధరలు తగ్గించాలన్న ప్రభుత్వ యోచనకు నిరసనగా 80 లక్షల మంది పత్తి రైతులకు సరఫరాలు నిలిపివేస్తామని ఎన్.ఎస్.ఎ.ఐ గత వారం హెచ్చరించింది. ‘‘కొత్త, తగ్గిన ధర ఈ ఏడాది విత్తనాల సరఫరా, విత్తనాల సౌలభ్యంపై తప్పకుండా ప్రభావం చూపవచ్చు.  వచ్చే ఏడాది వంగడాల ఉత్పత్తిపైన కూడా దాని ప్రభావం ఉండవచ్చు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎన్.ఎస్.ఎ.ఐ రిట్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం కూడా ఉంది’’ అని ఎన్.ఎస్.ఎ.ఐ డైరెక్టర్ జనరల్ కల్యాణ్ గోస్వామి చెప్పారు. 

విత్తనాల ధరలు 2011 నుంచి తగ్గిపోయాయి. కానీ, ఇంధనం, కార్మిక, సరఫరా చైన్ వ్యయాలు పెరిగాయని గోస్వామి చెప్పారు. ‘‘ప్యాకెట్‌కు ధరను కనీసం రూ. 150 పెంచాలని, పత్తి విత్తనాల ధరల పెంపునకు ఎన్.ఎస్.ఎ.ఐ సిఫార్సు చేసింది. కానీ, ఆ ఆలోచనను పక్కనపెట్టారు’’ అని ఆయన అన్నారు. ప్రభుత్వం గత ఏడాది రాయుల్టీలు, జి.ఎం. పత్తి విత్తనాల రిటైల్ ధరలు రెండింటినీ మార్చలేదు. భారతదేశపు పత్తి పంటలో 90 శాతం పైగా భాగం జన్యుపరంగా సవరించినదే. భారతదేశపు పత్తి ఉత్పత్తి 2017-18 సంవత్సరంలో 9.3 శాతం పెరగనుంది. కానీ, అది పరిశ్రమ విశ్లేషకులు అంచనా వేస్తున్న రికార్డు స్థాయి అత్యధిక ఉత్పత్తికన్నా తక్కువే. కొన్ని ప్రాంతాల్లో పత్తి పంటకు చిమ్మట గొంగళిపురుగు వల్ల వాటిల్లిన నష్టంతో ఉత్పత్తి దెబ్బతిందని భావిస్తున్నారు. 

Tags
English Title
India slashes Monsanto's GMO seed royalty, says US firm 'free to leave' anytime
Related News