పెర్త్ టెస్టు: 175 పరుగుల ఆధిక్యంలో ఆస్ట్రేలియా 

India vs Australia Highlights,  2nd Test Day 3, ustralia Lead By 175 Runs, Virat Kohli's Hundred
  • పెర్త్ రెండో టెస్టు‌లో మూడో రోజు ముగిసిన ఆట

  • రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ స్కోరు 132/4 

పెర్త్: భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య పెర్త్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. భారత పేసర్లు ఆసీస్‌ నాలుగు వికెట్లను కట్టడి చేయడంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 4 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. దీంతో ఆసీస్ 175 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాట్స్‌మన్ కెప్టెన్ టిమ్ పెయినే (8), ఉస్మాన్ ఖ్వాజా (41) పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఉస్మాన్, ట్రావిస్ హెడ్ 35 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రెండో ఇన్నింగ్స్ ఆరంభంలో ఆసీస్ కాస్త మెరుగ్గా ఆడినప్పటికీ అరోన్ పించ్ (25) పరుగుల వద్ద గాయపడ్డాడు. ఫించ్ తరువాత క్రీజులోకి వచ్చిన మార్కస్ హరీస్ (20), షాన్ మార్ష్ (5), పీటర్ హ్యాండ్స్‌కంబ్ (13) దూకుడుగా ఆడినప్పటికీ.. ఆస్ట్రేలియా 85 పరుగుల వద్ద మూడు వికెట్లను సమర్పించుకుంది.

భారత పేసర్లు విసిరిన బంతులను ఆసీస్ బ్యాట్స్‌మన్ ఖ్వాజా, హెడ్ ఆచితూచి ఆడుతూ నెమ్మదిగా స్కోరుబోర్డును పెంచేశారు. కానీ, ఒక దశలో హెడ్ (19) చెత్త షాట్ ఆడేందుకు ముందుకు వెళ్లి వికెట్‌ను చేజార్చుకున్నాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్ చేపట్టిన భారత్ 283 పరుగులకు ఆలౌట్ కాగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ 123 పరుగులతో సెంచరీ పూర్తి చేశాడు. లంచ్ విరామం అనంతరం ఆరంభమైన మ్యాచ్‌లో భారత్ జట్టు లోయర్ మిడిల్ ఆర్డర్ మరోసారి లోపించడంతో కేవలం 31 పరుగులకే నాలుగు వికెట్లను సమర్పించుకుంది.  

సంబంధిత వార్తలు