భారత్ బ్యాటింగ్.. రిషబ్ ఎంట్రీ.. 

Updated By ManamSat, 08/18/2018 - 15:44
India vs England, 3rd Test Day 1, England opt to bowl, Rishabh Pant
  • టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ 

  • ఆరంభమైన భారత్, ఇంగ్లండ్ మూడో టెస్టు

  • టెస్టుల్లోకి ఆరంగేట్రం చేసిన రిషబ్ పంత్ 

India vs England, 3rd Test Day 1, England opt to bowl, Rishabh Pantనాటింగ్‌హామ్‌: ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా శనివారం ఇక్కడ నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్‌బ్రిడ్జ్‌లో భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య మూడో టెస్టు ఆరంభమైంది. తొలుత టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ కెప్టెన్ జే రూట్‌ బౌలింగ్ ఎంచుకొని కోహ్లీసేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. మూడో టెస్టు ద్వారా భారత యువ ఆటగాడు రిషబ్‌ పంత్‌ 291వ ఆటగాడిగా టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. టాస్‌ వేయడానికి ముందు సహచర ఆటగాళ్ల సమక్షంలో కెప్టెన్ విరాట్‌ కోహ్లీ.. పంత్‌‌కు టెస్టు క్యాప్‌ను అందించాడు. వరుసగా రెండు టెస్టుల్లో పరాజయం చవిచూసిన భారత జట్టు మూడో టెస్టులో జట్టులో మార్పులతో బరిలోకి దిగుతోంది.

చైనామన్ బౌలర్ కులదీప్ స్థానంలో జస్‌ప్రీత్ బుమ్రాకు తుదిజట్టులో చోటు దక్కగా, మురళీ విజయ్ స్థానంలో ఓపెనర్‌గా శిఖర్ ధావన్, దినేశ్ కార్తీక్ స్థానంలో రిషబ్‌ పంత్‌‌కు చోటు దక్కింది. మరోవైపు రెండు టెస్టుల్లో వరుస విజయాలతో దూకుడు మీదున్న ఇంగ్లండ్ జట్టులో ఓ మార్పు చోటుచేసుకుంది. ఇంగ్లండ్ తుది జట్టులోకి బెన్ స్టోక్స్‌‌కు తిరిగి చోటు లభించింది. ఇప్పటికే రెండు టెస్టులో ఇంగ్లండ్ విజయం సాధించి 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక మూడో టెస్టులోనూ ఇంగ్లండ్ విజయం సాధిస్తే సిరీస్‌ను ఖాయం చేసుకున్నట్టే అవుతుంది. ఒకవేళ మూడో టెస్టులో భారత్ గెలిస్తే.. సిరీస్‌ను దక్కించుకునేందుకు మరో అవకాశం ఉంటుంది. నిర్ణయాత్మక ఈ టెస్టులోనైనా భారత్ గెలిచి సిరీస్‌ ఆశలను సజీవంగా నిలుపుకుంటుందో లేదో చూడాలి.  

జట్లు:
భారత్: శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, చతేశ్వర పూజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానె, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా. 

ఇంగ్లండ్: అలిస్టర్ కుక్, కీటన్ జెన్నింగ్స్, జోయ్ రూట్ (కెప్టెన్), ఒలై పోప్, జానీ బెయిర్ స్టో (వికెట్ కీపర్), జాస్ బట్లర్, బెన్ స్టోక్స్, క్రిస్ వోక్స్, అడిల్ రషీద్, స్టార్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్.

English Title
India vs England 3rd Test Day 1: England opt to bowl
Related News