‘ఇండియన్ 2’ ఫస్ట్‌లుక్

Updated By ManamFri, 09/07/2018 - 10:29
Indian 2

Indian 2ఉలగనాయగన్ కమల్ హాసన్ హీరోగా శంకర్ తెరకెక్కించనున్న చిత్రం ‘ఇండియన్ 2’(భారతీయుడు 2). 1996లో ఘన విజయం సాధించిన ‘ఇండియన్’ సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు. కొన్ని రోజులుగా ఈ చిత్ర లొకేషన్ల ఎంపిక విషయంలో తలమునకలైన దర్శకుడు శంకర్ ఇటీవలే కొన్నింటిని ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ ఆరంభం నుంచి ఈ మూవీ షూటింగ్‌ను ప్రారంభించనున్నారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. సేనాపతి ఈజ్ బ్యాక్ అంటూ విడుదల చేసిన ఈ లుక్‌లో కమల్ చేతితో మర్మ విద్యను ప్రదర్శిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో కమల్ సరసన నయనతార నటించనుండగా.. అజయ్ దేవగన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.

English Title
Indian 2 first look
Related News