భారత ఆర్మీ మరింత శక్తివంతం

Updated By ManamFri, 11/09/2018 - 15:31
Indian Army, K9 Vajra, M777 howitzers, field artillery tractors
  • కొత్త ఆయుధ పరికరాలను ప్రవేశపెట్టిన ఆర్మీ 

  • కే9 వజ్ర, ఎం777 ఫిరంగులు, అర్టిల్లరీ ట్రాక్టర్లు 

Indian Army, K9 Vajra, M777 howitzers, field artillery tractorsనాసిక్: భారత ఆర్మీ మరింత శక్తివంతంగా మారుతోంది. శత్రువుల బారి నుంచి దేశాన్ని రక్షించేందుకు అరుదైన ఆయుధాలను సమకూర్చుకుంటోంది. తాజాగా కొత్త ఆయుధ పరికరాలను భారత ఆర్మీ ప్రవేశపెట్టింది. కొత్త ఫిరంగి తుపాకీలు, మూడు కే9 వజ్ర, పది ఎమ్777 చిన్న ఫిరంగులు, సాధారణ గన్ టవర్స్ ఫిరంగి ట్రాక్టర్లతో కూడిన ఆయుధ పరికరాలను ప్రవేశపెట్టింది. మహారాష్ట్రలోని డియోలాలి అర్టిల్లరీ సెంటర్‌లో జరిగిన ఆరంభ వేడుకలో దేశ రక్షణ ఆయుధ పరికరాలను ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ హాజరయ్యారు. ఈ కొత్త ఆయుధ పరికారాల సాయంతో భారత భద్రతా దళాలు పర్వత భూభాగాల్లోని శత్రువులను సైతం మట్టుబెట్టే సామర్థ్యం ఉంది. 

కే9 వజ్ర, 155మిల్లీమీటర్లు 50 క్యాలిబర్‌ కలిగిన తుపాకీ దక్షిణ కొరియా నుంచి సేకరించారు. ట్యాంకు, గన్ బరెల్ మధ్య హైబ్రిడ్ మాత్రమే కాదు.. సెల్ఫ్ ప్రోపెల్డ్ గన్‌గా డిజైన్ చేశారు. 10 తుపాకీలను భారత్‌లో తయారుచేయగా, మిగతా 90 తుపాకీలను దక్షిణ కొరియాలో రూపొందించారు. కే9 వజ్రా ఫిరంగి తుపాకీని భారత ప్రైవేట్ రంగం తొలిసారిగా ప్రవేశపెట్టింది. ఈ తుపాకీ సామర్థ్యం దాదాపు 28 కిలోమీటర్ల నుంచి 38 కిలోమీటర్ల వరకు ఉంటుంది. 30 సెకన్లలో మూడు రౌండ్లు, మూడు నిమిషాల్లో 15 రౌండ్లు, 60 నిమిషాల్లో 60 రౌండ్లు పేల్చగల సామర్థ్యం ఉందని ఓ నివేదిక వెల్లడించింది. 

English Title
Indian Army adds more muscle with K9 Vajra, M777 howitzers and field artillery tractors
Related News