ఇండియన్ బ్యాంక్ ఎండీగా పద్మజ

Updated By ManamMon, 09/24/2018 - 22:20
 Chundur Padmaja

Ms-Padmaja-Chunduruచెన్నై: ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓగా  కిశోర్ కారట్ స్థానంలో చుండూరు పద్మజ నియమితులయ్యారు. ఆమె తక్షణమే పాలనా పగ్గాలు చేపట్టనున్నారని ఇండియన్ బ్యాంకు తెలిపింది. ఆమె ఇంతవరకు భారతీయ స్టేట్ బ్యాంకు డిప్యూటి మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. పది ప్రభుత్వ రంగ బ్యాంకుల మేనేజింగ్ డైరెక్టర్లు, సి.ఇ.ఓల నియామకానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన గల క్యాబినెట్ నియామకాల కమిటీ ఇటీవల ఆమోదం తెలిపింది.  సిండికేట్ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓగా  మృత్యుంజయ మహాపాత్రా నియమితులయ్యారు. ఆంధ్రా యూనివర్సిటీ  పూర్వ విద్యార్థిని అయిన పద్మజ భారతీయ స్టేట్ బ్యాంకులో ప్రొబేషనరీ అధికారిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. మూడు దశాబ్దాల వృత్తి జీవితంలో ఆమె క్రెడిట్ మేనేజ్‌మెంట్, రిటైల్ కార్యకలాపాలు, డిజిటల్ బ్యాంకింగ్. కోశాగార, అంతర్జాతీయ కార్యకలాపాలను నిర్వహించారు.

English Title
Indian Bank MD Padma
Related News