అసత్య వార్తలపై సమరం

Updated By ManamMon, 07/23/2018 - 13:16
 Lyric Jain

బ్రిటన్‌లో స్టార్టప్‌ను ఆరంభించిన ఎన్‌ఆర్‌ఐ జైన్

lyric jainలండన్: అసత్య.. నకిలీ వార్తలు! సామాజిక మాధ్యమాల్లో విర్రవీగుతున్న ఈ వార్తలు మన దేశంలో ఎంతటి బీభత్సాన్ని సృష్టిస్తున్నాయో తెలిసిందే. ఇలాంటి వార్తలకు చెక్ పెట్టేందుకు బ్రిటన్‌లో భారత సంతతికి చెందిన ఔత్సాహిక పారిశ్రామిక వేత్త లిరిక్ జైన్ కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగా ఓ స్టార్టప్ సంస్థను నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నారు. కర్ణాటకలోని మైసూరుకు చెందిన లిరిక్ జైన్.. కేంబ్రిడ్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తిచేశారు.

ఫేస్‌బుక్, వాట్సప్ తదితర సామాజిక మాధ్యమాల్లో విచ్చలవిడిగా అసత్య వార్తలు ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. భారత్‌లో వీటి ప్రభావం మరీ దారుణంగా ఉంది. చిన్నపిల్లలను ఎత్తుకెళ్తున్నారనే వార్తలు ప్రచారం కావడంతో.. తమ ప్రాంతంలో ఎవరైనా కొత్త వ్యక్తులు కనిపిస్తే చాలు వారి వివరాలకు తెలుసుకోకుండా సామూహిక దాడులకు పాల్పడుతున్నారు. కొట్టి చంపేస్తున్నారు. 

ఇలాంటి ఘటనలు ప్రపంచవ్యాప్తంగా  అనేక దేశాల్లోనూ కొనసాగుతున్నాయి. ఈనేపథ్యంలో ఓ సాంకేతిక పరిజ్ఞానాన్ని జైన్ రూపొందించారు. ప్రస్తుతం ఈ పరిజ్ఞానంపై పరీక్షలు జరుగుతున్నాయి. విజయ వంతమైతే బ్రిటన్, అమెరికాలో సెప్టెంబరు నుంచి ఈ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రానుంది. మన దేశంలో మాత్రం అక్టోబర్‌లో అందుబాటులోకి రావొచ్చు. 

English Title
Indian-Origin Lyric Jain platform fights fake news
Related News