వైఎస్సార్ సీపీలో చేరిన రఘురాజు

Updated By ManamWed, 09/05/2018 - 17:01
Indukuri Raghu Raju Joins YSRCP
  • జగన్ సమక్షంలో పార్టీలో చేరిన కళా ఆస్పత్రి అధినేత డాక్టర్‌ పైడి వెంకట రమణమూర్తి

Indukuri Raghu Raju, kala hospital murthy Joins YSRCP

విశాఖ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. ఇటీవలే మాజీమంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి పార్టీలో చేరగా, విశాఖ, విజయనగరం జిల్లాకు చెందిన పలువురు వైఎస్సార్ సీపీ కండువా కప్పుకున్నారు. విశాఖకు చెందిన  ప్రముఖ వైద్య నిపుణులు, కళా ఆస్పత్రి అధినేత డాక్టర్‌ పైడి వెంకట రమణమూర్తితో పాటు విజయనగరం జిల్లాకు చెందిన బిజేపీ నాయకుడు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ ఇందుకూరి రఘురాజు కూడా వైఎస్సార్ సీపీలో చేరారు. 

వీరిరువురు బుధవారం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. వీరికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ సమక్షంలో వైఎస్ జగన్‌ను కలిసిన ఇందుకూరి రఘురాజు పార్టీ సభ్యత్వం స్వీకరించారు. అలాగే డాక్టర్ రమణమూర్తితో పాటు  ఆయన సతీమణి డాక్టర్ కళావతి, ఆయన మామ రామారావుతో పాటుగా, పెద్ద ఎత్తున ఆయన అనుచరులు వైఎస్సార్ సీపీలో చేరారు.

కాగా విశాఖ జిల్లా  రావలమ్మపాలెం క్రాస్‌ మీదుగా పాదయాత్రగా వైఎస్ జగన్ ఆదిరెడ్డిపాలెం చేరుకున్నారు. భోజన విరామం కోసం శిబిరం వద్ద ఉన్న ఆయనను గుంటూరు జిల్లా పోలీసుల వేధింపులకు గురైన ముస్లిం యువకులు కలిశారు.

చంద్రబాబు సభలో ప్లకార్డులు ప్రదర్శించినందుకు పోలీసులు తమను ఏ విధంగా చిత్రహింసలు పెట్టింది, ఏయే కేసులు నమోదు చేశారన్న అంశాలను వారు ఈ సందర్భంగా జగన్ దృష్టికి తీసుకు వెళ్లారు.  ముస్లింలకు తాము అన్నివిధాలా అండగా ఉంటామని, పార్టీ అధికారంలోకి వస్తే ఆ కేసులన్నింటినీ రద్దు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

English Title
Indukuri Raghu Raju, kala hospital doctor murthy Joins YSRCP
Related News