అమ్మకానికి ఇన్ఫోసిస్ అనుబంధ సంస్థలు

Updated By ManamSat, 04/14/2018 - 22:54
Salil Parekh

Salil Parekhబెంగళూరు: ప్రధాన కార్యనిర్వహణాధికారి (సి.ఇ.ఓ)గా సలీల్ పరేఖ్  బాధ్యతలు చేపట్టిన మూడు నెలల కాలంలో సమాచార సాంకేతిక పరిజ్ఞాన సేవల దిగ్గజం ఇన్ఫోసిస్  కొన్ని క్లిష్టమైన పనులనే నిర్వహించినట్లు కనిపిస్తోంది. వ్యూహాన్ని పునః పరిశీలించుకోవడం నుంచి డిజిటల్ అవకాశాలపై దృష్టి కేంద్రీకరించడం వరకు సంస్థ పలు నిర్ణయాలు తీసుకుంది. ఇంతకుముందు సి.ఇ.ఓ అనుసరించిన ‘శాశ్’ (సాఫ్ట్‌వేర్ లైసెన్సింగ్-డెలివరీ) మోడల్‌ను వదిలించుకుంది. అనుబంధ సంస్థలైన శ్కావా, వివాదాస్పద పనయులను అమ్మకానికి పెట్టింది. అవెురికా కేంద్రంగా ఉన్న డిజిటల్ ఏజన్సీ వాంగ్ డూడీని 75 మిలియన్ డాలర్లకు కైవసం చేసుకుంటున్నట్లు కూడా కంపెనీ ప్రకటించింది. రెండు అనుబంధ సంస్థల నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకోవడం ద్వారా, ఒక్క పనయలోనే 90 మిలియన్ డాలర్లను మాఫీ చేసుకోవాలని ఇన్ఫోసిస్ ఒక నిర్ణయానికి వ చ్చింది. ఆ ఇజ్రేలీ టెక్నాలజీ సంస్థను కైవసం చేసుకునేందుకు 2015 ఫిబ్రవరిలో ఇన్ఫోసిస్ చెల్లించిన 20 కోట్ల డాలర్లలో అది సుమారుగా సగం మొత్తం కిందకు వస్తుంది. రెండు అ నుబంధ సంస్థల సమష్టి విలువ 316 మిలియన్ డాలర్లు కాగా, వాటి రుణ భారాలు 50 మిలియన్ డాలర్ల మేరకు ఉన్నాయి. వాటిని పద్దు పుస్తకాలలో ‘‘అమ్మకానికి ఉంచినవి’’గా పేర్కొన్నారు. 

గత ఏడాది ఆగస్టులో విశాల్ సిక్కా రాజీనామా చేశాక, బాధ్యతలు చేపట్టిన సలీల్ నాలుగు స్తంభాలపై కంపెనీని నిర్మించవచ్చని భావిస్తున్నారు. ‘‘దేదీప్యమానంగా ఉన్న డిజిటల్ వ్యాపార స్థాయిని పెంచుకోవడం, ఆటోవేుషన్, కృత్రిమ మేధ ఉపయోగించి మా క్లయింట్ల కోర్ టెక్నాలజీ వ్యాపారాన్ని శక్తిమంతం చేయడం, ఉద్యోగులకు తిరిగి నైపుణ్యాలను అలవరచడం, అవెురికా, యూరప్, ఆస్ట్రేలియాలలో స్థానికీకరణ ప్రయత్నాలను విస్తరించడం’’  ఆ నాలుగు అంశాలని సలీల్ వివరించారు. 2016-17 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంతో పోల్చితే 2017-18 ఆర్థిక సంవత్సరం క్యూ 4లో నికర లాభం 2.4 శాతం పెరిగి రూ. 3,690 కోట్లుగా నమోదైందని ఇన్ఫోసిస్ తెలిపింది. అదే కాలంలో రాబడులు 5.6 శాతం పెరిగి రూ. 18,083 కోట్లుగా నిలిచాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రాబడులు కాన్‌స్టంట్ కరెన్సీలో 6-8 శాతంగా, అవెురికన్ డాలర్లలో 7-9 శాతంగా వృద్ధి చెందగలవని భావిస్తున్నట్లు కూడా ఇన్ఫోసిస్ ప్రకటించింది. ఇన్ఫోసిస్ 2 లక్షల పైచిలుకు ఉద్యోగులకు కోటి డాలర్లతో ప్రత్యేక బోనస్ నిధిని సృష్టించింది. 

English Title
Infosys subsidiaries for sale
Related News