కాంగ్రెస్‌లో చేరికలు

Updated By ManamMon, 09/10/2018 - 00:11
uttam
  • ఉత్తమ్‌తో  మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజయ్య భేటీ

  • బీసీ ఐక్యవేదిక నేత రాంకోటి పార్టీలో చేరిక

  • సిద్దిపేట, వైరా, స్టేషన్ ఘన్‌పూర్ కార్యకర్తలతో ఉత్తమ్ భేటీ

uttamహైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ కదనోత్సాహంతో ఉంది. ఆ పార్టీ నేతలు ఊహించని విధంగా రాష్ట్రంలోని పలు నియోజకవర్గాలకు చెందిన నేతలు టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిసి పార్టీలో చేరేందుకు అనుమతి తీసుకుంటున్నారు. ఉత్తమ్‌ను కలుస్తున్న వారిలో టీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తలు, నాయకులే పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఆదివారం కూడా చేరికలు కొనసాగాయి. బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు అల్లంపల్లి రాంకోటి తన అనుచరులతో గాంధీభవన్‌కు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉత్తమ్ ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ కూడా కాంగ్రెస్ లో చేరుతున్నారు. గాంధీభవన్ లో ఉత్తమ్‌తో ఆయన భేటీ అయ్యారు. కాంగ్రెస్ లో చేరతానని ఉత్తమ్ తో చెప్పగా వై నాట్ తప్పకుండా కాంగ్రెస్ కుటుంబంలోకి ఆహ్వానిస్తామని భరోసా ఇచ్చారు. ఎప్పుడు చేర్చుకునేది పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ డాక్టర్ రామచంద్ర కుంటియాతో కలసి నిర్ణయిస్తామని ఉత్తమ్ చెప్పారు. ఏఐసీసీ సభ్యులు ప్రియాంకష సందీప్ రాజ్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌కు చెందిన టీఆర్‌ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు. సిద్ధిపేట, వైరా స్టేషన్ ఘన్‌పూర్‌కు చెందిన కాంగ్రెస్  కార్యకర్తలు కూడా ఉత్తమ్‌ను కలిశారు.  వైరా నియోజకవర్గాన్ని సీపీఐకి కేటాయించవద్దని ఉత్తమ్ కు విజ్ఞప్తిచేశారు. ఈ సందర్భంగా రాంకోఠి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ద్వారానే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని అందుకే కాంగ్రెస్‌లో చేరానని రాంకోఠి ఈ సందర్భంగా చెప్పారు. టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, అపద్ధర్మ సీఎం కేసీఆర్ అబద్ధాలు చెప్పి రాష్ట్ర ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.

English Title
Inserts in Congress
Related News