ఖైదీ హక్కుల ఉద్యమ స్ఫూర్తి

Updated By ManamTue, 09/11/2018 - 01:25
mathanam

imageఆనాడు బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడినందుకు జతీన్‌దాస్‌ను అరె స్ట్ చేసి జైల్లో నిర్భందించా రు. నిర్బంధి చినా అతని పోరాటం ఆగలేదు. పీడిత తాడిత ప్రజలే తమ గురువులు అని జైల్లో కాలరాయబడిన ఖైదీల హక్కుల కోసం రాజీలేని పోరాటాన్ని నిర్వహించి కఠోర మైన అమరణ నిరహార దీక్ష చేసి వీరమరణం పొందాడు. 1929 సెప్టెంబర్ 13న లాహార్ సెంట్రల్ జైలులో 63 రోజులుగా అమరణ నిరహర దీక్షలో ఉంటూ తుదిశ్వాస విడిచాడు జతీన్‌దాస్. ఆనాడు బ్రిటిష్ వలస పాలనలో జైళ్లు ఆధ్వానంగా ఉండేవి.

 జైల్లో ఉన్న ఖైదీల హక్కు లు పూర్తిగా హరించబడినాయి. 1884లో జైలు మాన్యువల్ అతి క్రూరమైంది.image క్షణికావేశంలో నేరాలకు పాల్పడి జైలుకు వచ్చిన ఖైదీలను సం స్కరించాల్సింది పోయి జైళ్లు ఖైదీల పాలిట మృ త్యుకూపాలుగా మారాయి. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో తెల్లదొరల పాలనకు వ్యతిరేకోద్యమంలో భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్, జతీన్‌దాస్, బటీకేశ్వర్ దత్తులు కలిసి పంజాబ్ రాష్ట్రంలోని లాహోర్ సెంట్రల్ జైలులో రాజకీయ ఖైదీల హక్కుల వేదికగా కమిటిని ఏర్పా టు చేసినారు. ఖైదీల డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. ‘రాజకీయ ఖైదీలకు యూరోపియన్ ఖైదీలకిచ్చే సదుపాయాలు కల్పించాలి. రాజకీయ ఖైదీలచే ఎలాంటి పనులు చేయించరాదు. రాజకీయ ఖైదీలకు ఒక్కొక్కరికి వార పత్రికలు అందించాలి. చదువుకోవడానికి పుస్తకాలు, రాయడానికి పెన్నులు అందించాలి. రాజకీయ ఖైదీలందరూ అంటే ప్రజా ఉద్యమాల్లో పాల్గొని జైలుకు వచ్చిన రాజకీయ ఖైదీలందరినీ ఒకే బ్యారక్‌లో ఉంచాలి. బాత్‌రూములు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి. పోషకాహారం, తాగునీరు అందించా’లంటూ వివిధ డిమాండ్లు పెట్టారు. లాహోర్ జైలులో నిరసనలు నిరహార దీక్షలు చేయకూడదని జైలు అధికారులు ఆంక్షలు విధించారు. ఖైదీల హక్కుల ఉద్యమాన్ని అణచివేయడానికి అనేక కుట్రలు కుయుక్తులు పన్నారు. అయినా జైలు అధికారు ల ఆదేశాలను విభేదిస్తూ నిరాహార దీక్షలకు పూనుకున్నారు. దీక్షల్ని భగ్నం చేయడానికి అనేక విధానాల్ని అమలు పర్చారు. 

ఖైదీల దీక్షలు వారంరోజులు గడిచి పోయినాయి. ఖైదీల పరిస్థితులు క్షీణించాయి. అయినా ప్రాణాల్ని లెక్క చేయకుండా దీక్ష తీవ్రంగా కొనసాగుతోంది. నిరాహార దీక్షలో కూర్చున ఖైదీలకు బలవంతం గా ఆహారం ఎక్కించి దీక్షల్ని నీరుగార్చాలని ద్రవ పదార్థాలను బలవంతంగా ఎక్కించడాని కి ప్రయత్నిస్తే దానిని తిప్పికొట్టారు. జతీన్‌దాస్ ఆరోగ్యం రోజు రోజుకూ క్షీణించిపోతోంది. జతీన్‌దాస్ స్పృహ కోల్పోయాడు. మాట్లాడలేకపోతున్నాడు. కన్నుైసెరలు కండ్లు ముసుకుపోయాయి. దీక్ష నెలరోజులకు చేరింది. శక్తిని కో ల్పోయాడు. చేతులు చల్లబడుతున్నాయి. నాడీ పడిపోయింది. జతీన్‌దాస్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. జైలులో జైలు రాజకీయ ఖైదీల పో రాటానికి సంఘీభావం ప్రకటించారు. వివిధ రాష్ట్రాలో ఉద్యమాలు ఎగిసిపడుతున్నాయి. పాలకుల్లో వణుకు పుట్టింది. చివరకు ఖైదీల డి మాండ్లకు తలవంచక తప్పలేదు. రాజకీయ ఖైదీల డిమాండ్లను పరిస్కరించేందుకు విచారణ కమిటీని సెప్టెంబర్ 2న అప్పటి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. జతీన్‌దాస్‌ను బేషరతుగా విడుదల చేయడానికి ఒప్పుకుంది. అప్ప టికే జతీన్‌దాస్ ఆరోగ్యం క్షీణించింది. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. జతీన్‌దాస్, బటీకేశ్వర్, దత్తుల దీక్షలు యథావిధిగా కొనసాగుతున్నాయ్. కమిటీని నియమించినప్పకీ ఖైదీల డిమాండ్లను పరిష్కరించకుండా కాలయాపన చేసినారు. ఖైదీలకు న్యాయం జరగలేదు. నిరహార దీక్ష కోనసాగుతూ 63 రోజులకు చేరినాయి. 63 రోజులుగా నిరాహార దీక్ష లు చేస్తూ.... 1929 సెప్టెంబర్ 13న జతీన్‌దాస్ లాహోర్ సెంట్రల్ జైలులో అస్తమించాడు. జతీన్‌దాస్ మరణవార్తతో భారతదేశమంతటా వి షాద ఛాయలు అలుముకున్నాయి. ప్రజలు కసి తో రగిలిపోతున్నారు. పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్ర జానీకం దుఃఖసాగరంలో మునిగిపోయారు. అమరుడు ఖైదీల హక్కుల ఆరాధ్యుడు జతీన్‌దాస్‌కు జోహార్లు అర్పించారు. కలకత్తాలో అయన అంతిమ యాత్రలో లక్షలాది మంది పాల్గొన్నా రు. 

జతీన్‌దాస్ వీర మరణం పొందినా భగత్‌సింగ్ నిరాహార దీక్ష ఆపలేదు. అప్పటికి నిరాహార దీక్షలు మొదలుపెట్టి 114 రోజులకు చేరింది. పాలకులు మరోసారి తలవంచక తప్పలేదు. రాజకీయ ఖైదీల డిమాండ్లను పరిష్కరి స్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఖైదీల హక్కుల సాధన దిశగా చీకటి రోజుల్లో వెలుగైన జతీన్‌దాస్ అమరత్వం ఒక రమణీయం. జతీన్‌దాస్ వీరమరణాన్ని సెప్టెంబర్ 13ను అంతర్జాతీయ మానవ హక్కుల దినైమెన ఖైదీల హక్కు ల దినోత్సవంగా దేశవ్యాప్తంగా అన్ని జైళ్లలో జరుపుకుంటారు. రాజకీయ ఖైదీలు సాధారణ ఖైదీలు పోరాట దినాలుగా పాటించాలని 1998 లో మూషీరాబాద్ జైలులో అప్పటి మావోయిస్టు జనశక్తి రాజకీయ ఖైదీలు శాఖ మూరి అప్పారావ్, పటిల్ సుధాకర్‌రెడ్డి, మేడం బాలకృష్ణలు పిలుపునిచ్చారు. దాన్ని నేటికీ పాటిస్తున్నారు. జైలు మాన్యువల్‌ను ఎక్కడా పాటించ డం లేదు. ఛత్తీస్‌గఢ్, ఒడిషా, బిహార్, తెబి గాణ, ఆంధ్రప్రదేశ్, తీహార్ జైళ్లలో ఖైదీల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. జైళ్లలో ఖైదీల రాకలతో సరిపడటం లేదు. దేశ వ్యాప్తం గా రోజుకు ఏదో ఒక జైలులో ఐదు మంది ఖైదీలు చనిపోతున్నారు. 1980లో ఖైదీల సంస్కరణల కోసం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ముల్లా సూచించిన వాటిని ఇంతవరకు పట్టిం చుకోడం లేదు. ఖైదీల క్షమాభిక్షలు దయాదాక్షిణ్యాలుగా మారినాయి. క్షమాభిక్షలు రాకపోవడంతో ఖైదీలు పెరోల్‌పై ఇంటికి వెళ్లి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గుండెపోట్లతో చనిపోతున్నారు. 1976లో ఆదిలాబాద్ జిల్లాలో భూస్వామిని చంపాడనే నేపంతో ముషీరాబాద్ జైలులో కృష్ణగౌడ్ భూమయ్యలను ఉరితీసినా రు. ఉరిశిక్షల వల్ల నేరాలు తగ్గుతాయని అనుకోవడమే భ్రమ. రాజకీయ ఖైదీల విచారణ ఖైదీలుగా 10 సంవత్సరాలు జైళ్లల్లో మగ్గుతున్నారు. అణచివేతలకు కేంద్రాలుగా మారాయి జైళ్లు. ఖైదీలకు వైద్య సదుపాయాలు అందక తనువు చాలిస్తున్నారు. జైళ్లు మృత్యుకూపాలుగా మారాయి. బ్రిటిష్ కాలం నుంచి నేటి దాకా జైళ్లలో వివిధ రూపాల్లో నిరంతరం పోరాటాలు జరుగుతున్నాయి. 1929 సెప్టెంబర్ 13న లాహోర్ జైలులో ఖైదీల హక్కుల సాధన కోసం అమరణ నిరాహారదీక్ష చేస్తూ వీరమరణం పొం దిన జతీన్‌దాస్ అమరాత్వన్ని ఖైదీల హక్కుల దినంగా పాటించడమే జతీన్‌దాస్‌కు అసైలెన నివాళి. సెప్టెంబర్ 13వ తేదిన ఖైదీల హక్కుల దినం గా ఖైదీలు పాటించడమే నివాళి. ఆయన పోరాటం ఖైదీలకు మార్గదర్శకం!

- దామరపల్లి నర్సింహ్మరెడ్డి
9581358696  
(13న ఖైదీల హక్కుల దినం)

Tags
English Title
Inspired by the prison rights movement
Related News