మంత్రి లోకేష్, విష్ణు మధ్య ఆసక్తికర చర్చ

Updated By ManamWed, 03/07/2018 - 11:07
Interesting Discussion

మంత్రి లోకేష్, విష్ణు మధ్య ఆసక్తికర చర్చఅమరావతి: గత కొద్దిరోజులుగా మిత్రపక్షమైన బీజేపీ-టీడీపీ ఉప్పు నిప్పులా తయారైన సంగతి తెలిసిందే. ఇటు అసెంబ్లీ సమావేశాలు, అటు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవ్వడంతో ఈ రెండు పార్టీల నేతల మధ్య వివాదం మరింత ముదిరినట్లైంది. ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకుంటూ దుమారం రేపుతున్నారు.  

ఇదిలా ఉంటే బుధవారం ఉదయం అసెంబ్లీ లాబీల్లో మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే విష్ణుకుమార్ మధ్య ఆసక్తికర చర్చ సాగింది. శాసనమండలికి వెళ్తున్న మంత్రిని ఆపిన విష్ణు నేరుగా బీజేపీ ఎల్పీ ఆఫీసుకెళ్లారు. బీజేపీ ఎల్పీ ఆఫీసు వాస్తు బాగోలేదని విష్ణు.. మంత్రికి వివరించారు. అయితే తన కార్యాలయాన్ని మీరు వాడుకోండి.. తాను మీ కార్యాలయాన్ని వాడుకుంటానని లోకేష్ బదులిచ్చారు. వద్దు సార్.. మీరు మంత్రులు మా ఆఫీసులో ఎలా ఉంటారని విష్ణు.. లోకేష్‌‌కు వివరించారు. వీరిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం.. అసెంబ్లీ లాబ్లీ నుంచి బీజేపీ ఎల్పీ కార్యాలయానికి వెళ్లడం ఇదంతా అసెంబ్లీ ఆవరణలో హాట్ టాపిక్‌గా మారింది.

English Title
Interesting Discussion Between Minister Nara Lokesh and BJP Mla Vishnu kumar Raju
Related News