ఐపీఎల్ 12వ సీజన్ మార్చిలోనే..!

Updated By ManamFri, 06/01/2018 - 22:52
ipl

iplముంబై: ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్ 2018) సీజన్-11 ఇప్పుడుప్పుడే ముగిసి కొన్ని రోజులు కూడా కాలేదు. అప్పుడే వచ్చే ఏడాది సీజన్ ఐపీఎల్ గురించి చర్చలు మొదలయ్యాయి. ఈసారి ఐపీఎల్-12వ సీజన్ ముందుగానే జరుగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే అభిమానులు ఎంతగానో ఎదురుచూసే వరల్డ్ కప్ కూడా 2019లోనే జరగనుంది. వచ్చే ఏడాది వరల్డ్ కప్‌తో పాటు.. సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మార్చిలోనే ఐపీఎల్‌ను నిర్వహించాలని బీసీసీఐ భావిస్తుంది. ఇంగ్లండ్ వేదికగా వరల్డ్ కప్ వచ్చే సంవత్సరం మే 30 నుంచి ప్రారంభమవుతుంది. భారత ప్లేయర్స్ నిబంధనల ప్రకారం ఒక టోర్నీ అయిపోయిన తర్వాత మరో టోర్నీలో మ్యాచ్ ఆడటానికి కనీసం 15 రోజుల విరామం ఉండాలి. దీనిలో భాగంగానే ఐపీఎల్-12వ సీజన్ త్వరగానే నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇంగ్లండ్‌లోని వేల్స్ వేదికగా 2019 మే 30 నుంచి జూలై 14 వరకు వరల్డ్ కప్ జరగనుంది. అయితే ప్రతి సంవత్సరం ఐపీఎల్ ఏప్రిల్ మొదటి లేదా రెండో వారంలో ప్రారంభమై మే నెల చివరి వారంలో ముగుస్తుంది. కానీ, ఈసారి మాత్రం ఐపీఎల్ మే మూడో వారంలోనే ముగించాలి. అలా అయితేనే ఇండియన్ ప్లేయర్స్‌కు వరల్డ్ కప్‌లో ఆడేందుకు 15 రోజుల గ్యాప్ లభిస్తుంది. ఈ విధంగా చూస్తే 2019లో మార్చి 29న  ఐపీఎల్ -12వ సీజన్ ప్రారంభమతుందని సమాచారం. అంతేకాక ఐపీఎల్-12ను విదేశాల్లో నిర్వహించే అవకాశం ఉందన్నారు. ఎలక్షన్స్ సమయంలో మ్యాచ్‌లు నిర్వహిస్తే భద్రత కష్టమవుతుంది. గతంలో కూడా 2009లో ఎన్నికల సమయంలో ఐపీఎల్‌ను దక్షిణాఫ్రికాలో నిర్వహించిన విషయం తెలిసిందే. ఐపీఎల్-11వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ కైవసం చేసుకుంది.

Tags
English Title
IPL 12th season in March
Related News