చాంపియన్ చెన్నై

Updated By ManamSun, 05/27/2018 - 23:40
win
  • ఫైనల్లో సన్‌రైజర్స్ పరాజయం

  • మూడోసారి టైటిల్ గెలుచుకున్న సూపర్‌కింగ్స్

  • వాట్సన్ సూపర్ సెంచరీ

chennaiచెన్నై చాంపియన్లా ఆడింది... రెండేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన ధోనీ గ్యాంగ్ 2018 ఐపీఎల్ టైటిల్‌ను సొంతం చేసుకుని హ్యాట్రిక్ సాధించింది.  2010, 2011లో ఐపీఎల్  విజేతగా నిలిచిన చెన్నై సన్‌ రైజర్స్‌తో జరిగిన ఫైనల్లో అద్భుత విజయంతో మరోసారి 
చాంపియన్ అయింది.


చెన్నై : ఓపెనర్ వాట్సన్ సూపర్ సెంచరీతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్లో చె న్నై సూపర్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో చెన్నై జట్టు మూడో సారి ఐపీఎల్ గెలుచుకుని హ్యాట్రిక్ కొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 179  పరుగులు చేయగా.. చెన్నై జట్టు 18.3  ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి 181 పరుగులు చేసి విజయం సాధించింది. ఓపెనర్ వాట్సన్ సన్‌ రైజర్స్ బౌలర్లను రఫ్పాడేశాడు. మొత్తం 57 బంతుల్లో 11 ఫోర్లు 8 సిక్స్‌లతో 117 పరుగులు చేసి అజేయంగా నిలిచి ఫైనల్ మ్యాచ్‌లో హీరో అయ్యాడు.

ఆదుకున్న పఠాన్
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోరు 13 పరుగుల వద్ద ఓపెనర్ శ్రీవాత్సవ్ గోస్వామి(5) తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఆ తరుణంలో ధావన్-విలియమ్సన్‌ల జోడి మరమ్మత్తులు చేపట్టింది. ఈ జోడి 51 పరుగుల  బాగస్వామ్యాన్ని సాధించిన తర్వాత ధావన్ (26: 25 బంతుల్లో 2 ఫోర్లు, 1సిక్స్) రెండో వికెట్‌గా నిష్క్రమించాడు.  ఆపై విలియమ్సన్-షకిబుల్‌ల జోడి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లింది. వీరిద్దరూ 37 పరుగులు జత చేసిన తర్వాత విలియమ్సన్(47: 36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు)  ఔటయ్యాడు. అటు తర్వాత ధాటిగా ఆడిన షకిబుల్ హసన్(23: 15 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్), దీపక్ హుడాలు స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో సన్‌రైజర్స్ 144 పరుగులకు ఐదో వికెట్‌ను నష్టపోయింది.  చివర్లో యూసఫ్ పఠాన్(45 నాటౌట్ 25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులకు తోడు, బ్రాత్‌వైట్(21: 11 బంతుల్లో 3 సిక్సర్లు) బ్యాట్ ఝుళిపించడంతో సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది.   చెన్నై బౌలర్లలో ఎన్‌గిడి, కరణ్ శర్మ, బ్రావో, రవీంద్ర జడేజా, శార్దూల్‌లు తలో వికెట్ తీశారు.

స్కోరుబోర్డు

chennaiసన్‌ రైజర్స్: గోస్వామి (రనౌట్) 5, ధావన్ (బి) జడేజా 26, విలియమ్స్‌న్ (స్టంప్) ధోనీ (బి) శర్మ 47, షకీబుల్ హసన్ (సి) రైనా (బి) బ్రావో 23, యూసఫ్ పఠాన్ (నాటౌట్) 45, హుడా (సి) షోరే (బి) ఎంగిడి 3, బ్రాత్‌ైవెట్ (సి) రాయుడు (బి) ఠాకూర్ 21, ఎక్స్‌ట్రాలు 8, మొత్తం (20 ఓవర్లలో 178/6). వికెట్ల పతనం: 1-13, 2-64, 3-101, 4-133, 5-144, 6-178. బౌలింగ్: చాహర్ 4-0-25-0, ఎంగిడి 4-1-26-1, ఠాకూర్ 3-0-31-1, శర్మ 3-0-25-1, బ్రావో 4-0-46-1, జడేజా 2-0-24-1.

చెన్నై సూపర్ కింగ్స్: వాట్సాన్ (నాటౌట్) 117, డుప్లేసిస్ (సి) అండ్ (బి) సందీప్ 10, రైనా (సి) గోస్వామి (బి) బ్రాత్‌ైవెట్ 32, రాయుడు (నాటౌట్)17, ఎక్స్‌ట్రాలు: 5, మొత్తం 18.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 181. వికెట్ల పతనం: 1-16, 2-133. బౌలింగ్: భువనేశ్వర్ 4-1-17-0, సందీప్ శర్మ 4-0-52-1, సిద్ధార్థ్ కౌల్ 3-0-43-0, రషీద్ ఖాన్ 4-0-25-0, షకీబుల్ హస్సన్ 1-0-15-0, బ్రాత్ వెట్ 2.3-0-27-1.

వాట్సన్ సెంచరీ ఇలా..
57 బంతుల్లో
117 పరుగులు
11 ఫోర్లు
8 సిక్స్‌లు

English Title
IPL - 2018 Champion is Chennai
Related News