మంబై లక్ష్యం 175 పరుగులు

Updated By ManamSun, 05/20/2018 - 18:08
IPL 2018, Delhi daredevils, Mumbai Indians, Rishabh Pant
  • రెచ్చిపోయిన రిషబ్ పంత్.. హాఫ్ సెంచరీ పూర్తి

IPL 2018, Delhi daredevils, Mumbai Indians, Rishabh Pantన్యూఢిల్లీ: ఐపీఎల్‌-11సీజన్‌లో భాగంగా ఆదివారం ఇక్కడ ఢిల్లీ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 174 పరుగులు సాధించింది. దీంతో ప్రత్యర్థి జట్టు ముంబై ఇండియన్స్‌కు 175 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఢిల్లీ ఓపెనర్లలో పృథ్వీ షా (12) రనౌట్ కాగా, మ్యాక్స్‌వెల్ (22) బుమ్రా బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు. ఢిల్లీ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కేవలం (6) పరుగులకే మార్కండే బౌలింగ్‌లో హర్దీక్ పాండ్యకు క్యాచ్ ఇచ్చి మూడో వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు.

ఆ తరువాత వచ్చిన రిషబ్ పంత్, విజయ్ శంకర్ దూకుడుగా ఆడుతూ స్కోరులో వేగాన్ని పెంచారు. అందివచ్చిన బంతులను ఆచితూచి ఆడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. రిషబ్ పంత్ (44 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్) విజృంభించి 64 పరుగులతో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఒక దశలో హర్దిక్ పాండ్య బౌలింగ్‌ రూపంలో పంత్ దూకుడుకు బ్రేక్ పడటంతో పోలార్డ్‌కు క్యాచ్ ఇచ్చి క్రీజునుంచి నిష్ర్కమించాడు. విజయ్ శంకర్ (30 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్) 43 పరుగులు, అభిషేక్ శర్మ (15) పరుగులతో నాటౌట్‌గా క్రీజులో ఉన్నారు. ముంబై బౌలర్లలో హర్దీక్ పాండ్యా, బుమ్రా, మార్కండే తలో వికెట్ తీసుకున్నారు.

English Title
IPL 2018: Delhi daredevils set target to Mumbai Indians as 175 runs




Related News