కోటి ఎకరాలకు సాగునీరందించాలె

kcr
  • రెండేండ్లలో ప్రాజెక్టులు పూర్తి చేయాలె

  • ఆలసత్వం లేకుండా పనులు కొనసాగించాలె

  • సీతారామ, శ్రీరామసాగర్‌ల జాప్యంపై ఆగ్రహం

  • ప్రాజెక్టులపై అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష 

హైదరాబాద్: రాష్ట్రంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని రెండేండ్లలో పూర్తిచేసి కోటి ఎకరాలకు సాగునీరందించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ఎక్కడా జాప్యం లేకుండా యుద్ద ప్రాతిపదికన పనులు చేయాలని కోరారు. సీతారామ, శ్రీరామసాగర్ పునరుజ్జీవం పథ కం పనులు మందకొడిగా నడుస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం వర్క్ ఏజెన్సీలతో సంబంధిత అధికారులు మాట్లాడి సత్వరం పనులు పూర్తి చేయాలని కోరారు. ప్రాజెక్టుల నిర్మాణం కోసం సేకరించిన భూములకు సంబంధించిన పరిహారం వెంటనే చెల్లించాలని ఆదేశించారు. ఇందుకోసం అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలని ఆర్దికశాఖ అధికారులకు సూచించారు. ప్రాజెక్టుల నిర్మాణాన్ని స్వయంగా పరిశీలించేందుకు తానే స్వయంగా రెండు రోజుల పాటు నిర్మాణ ప్రాంతాలను సందర్శించాలని సీఎం నిర్ణయిం చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మేడి గడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజిలను పంపుహౌజ్‌లను సీఎం మంగళవారం సందర్శిస్తారు. అనంతరం మరో రోజు ఎస్‌ఆర్‌ఎస్పీ పునరుజ్జీవ పథకం కింద చేపట్టిన పనులను పరిశీలిస్తారు.శనివారం నీటి ప్రాజెక్టుల పనుల పురోగతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. దాదాపు ఏడుగంటలపాటు సమ గ్రంగా సమీక్షించారు. మంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, ఆర్దికశాఖ ముఖ్యకార్యదర్శి  రామకృష్ణరావు, నీటి పారుదల శాఖ ఎస్‌ఇ మురళీధర్ ఇతర అధికారులతో పాటు ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు వేమలు ప్రశాంత్‌రెడ్డి పాల్గొ న్నారు. కాళేశ్వరం, ఎస్‌ఆర్‌ఎస్పీ పునరుజ్జీవ పథకంలో భాగంగా చేపట్టిన నిర్మాణాలపై కూలంకశంగా చర్చిం చారు. అధికారులకు తగు సూచనలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం సేకరించిన భూములు తక్షణం పరిహారం చెల్లించాలని ఆదేశించారు. గందమల్ల, బస్వా పురం రిజర్వాయర్ల భూనిర్వాసితులకు చెల్లించడానికి రూ. 80కోట్లు విడుదల చేయాలని  ఆర్దిక శాఖను సీఎం కోరారు. భూపాలపల్లి, నిర్మల్, పెద్దపల్లి, భువనగిరి జిల్లాల కలెక్టర్లకు కూడ వెంటనే పరిహారానికి సంబం ధించిన డబ్బులు విడుదల చేయాలని చెప్పారు. ఎస్‌ఆర్ ఎస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా చేపట్టిన పనుల వల్ల వరద కాలువలో నీటి లభ్యత ఎక్కువగా ఉంటుంది. ఫ్లడ్ ప్లో కెనాల్ నుంచి ఆప్ టెక్ తూముల ద్వారా  అన్ని చెరువులకు  నీరందించాలి.  కాకతీయ కెనాల్- ఫ్లడ్ ఫ్లో కెనాల్ మధ్యనున్న ఆయకట్టుకంతా నీరందించేలా  ఈ ప్రాంతంలోని అన్ని చెరువులు నింపాలని ముఖ్యమంత్రి సూచించారు. తెలంగాణలో ఎక్కువ భూభాగానికి నీరందించే  కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో మరింత  వేగం పెరగాలి. వచ్చే జూన్,జూలై నాటికి నీరందించాలి. మేడి గడ్డ బ్యారేజి నిర్మాణం అనుకున్న వేగంగా జరగడం లేదు.  మేడిగడ్డతో పాటు అన్నారం,  సుందిళ్ల బ్యారే జిలు, పంపుహౌజ్ నిర్మాణాల్లో వేగం పెరగాలని పేర్కొ న్నారు. కాళేశ్వరం పనుల్లో జాప్యాన్ని ఎట్టి పరిస్దితుల్లో సహించేది లేదని హెచ్చరించారు. పనులను ప్రత్యక్షంగా చూసేందుకు వచ్చే మంగళవారం ప్రాజెక్టు పరిధిలోని  బ్యారేజిలు, పంపుహౌజ్‌ల నిర్మాణ ప్రాంతాలను  సంద ర్శిస్తానని సీఎం చెప్పారు. సింగూరుకు  రెండు ఎత్తి పోతల పథకాలు నిర్మించి నారాయణఖేడ్ నియోజక వర్గానికి లక్ష, జహీరాబాద్ నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీరందించాలని,దీనికి సంబంధించి ప్రతిపాద నలు వెంటనే సిద్దం చేయాలని కోరారు. కౌలాస్ నాలాను పటిష్టం చేయడంతో పాటు నాగమడుగు పనులు చేయడం ద్వారా జుక్కల్ నియోజ కవర్గానికి సాగునీరు అందించాలిన చెప్పారు. మహారాష్ట్ర అధికా రులతో మాట్లాడి లెండి ప్రాజెక్టు పనులు త్వరగా  పూర్తియ్యేలా చూడాలని ఆదేశించారు. సీతారామ ఎత్తి పోతల పథకంతో పాటు శ్రీరామసాగర్ పునరుజ్జీవ పథకం, దేవాదుల ప్రాజెక్టు పనులు అనుకున్నంత వేగంగా జరగడంలేదని సీఎం అసంతృప్తి, ఆగ్రహం  వ్యక్తం చేశారు. పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు.  సీతారామ ఎత్తిపోతల పథకానికి  అవసరమైన  11వేల కోట్ల నిధుల సేకరణ కూడా పూర్తియిందని, పనుల్లో ఏమాత్రం జాప్యం, నిరక్ష్యం వహించవద్దని సీఎం అన్నారు. వర్క్ ఏజన్సీల బాధ్యులతో సీఎం స్వయంగా పోన్లో మాట్లాడారు. ఎస్‌ఆర్‌ఎస్పీ పునరుజ్జీవ పథకం పనులను మే కల్లా పూర్తి చేస్తామని వర్క్ ఏజన్సీల ముఖ్యమంత్రికి మాటిచ్చాయి .పాలమూరు-రంగారెడ్డి, డిండి, సీతారామ ,దేవాదుల ప్రాజెక్టులపై త్వరలోనే మరోసారి విసృత్త స్దాయిలో సమీక్ష నిర్వహించాలని సీఎం నిర్ణయించారు.

Tags

సంబంధిత వార్తలు