లోక్‌సభ బరిలో ఐశ్వర్యారాయ్

Updated By ManamMon, 05/28/2018 - 00:33
ishwarya rai
  • వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్న లాలు కోడలు

ishwaryaపట్నా: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆర్జేడీ అధినేత లాలూప్రసా ద్ యాదవ్ కోడలు, తేజ్‌ప్రతాప్ యాదవ్ భార్య ఐశ్వర్యారాయ్ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బిహార్‌లోని ఛాప్రా నియోజకవర్గం నుంచి ఆమె బరిలోకి దిగే అవకాశ ముందని తెలుస్తోంది. అయితే, పార్టీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ ఈ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. బిహార్ మాజీ సీఎం దరోగా ప్రసాద్ రాయ్ మనవరాలు ఐశ్వర్యరాయ్‌ను ఈ నెల 12న తేజ్‌ప్రతాప్ పెళ్లి చేసకున్న విషయం తెలిసిందే. అయితే.. ఆమె చాప్రాకు చెందిన వ్యక్తి కావడంతో.. ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే బాగుంటుందని పార్టీ శ్రేణులు కోరుకుంటున్నాయి. చాప్రా ఆడబిడ్డ అయిన ఐశ్వర్య ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిస్తే బాగుంటుందని, ఈ విషయంలో లాలూ తుది నిర్ణ యం తీసుకోవాల్సి ఉందని పార్టీ నేత రాహుల్ తివారీ పేర్కొన్నారు. మరోవైపు ఐశ్వర్య ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారన్న వార్త అధికారికంగా ధ్రువీకరించక ముందే.. అధికార జేడీయూ ఆర్జేడీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది. ఆర్జేడీ కోసం కార్యకర్తలు ఎంత కష్టపడినా.. ఎన్నికల్లో టికెట్లు మాత్రం లాలూ కుటుంబానికే దక్కుతాయని జేడీయూ నేతలు విమర్శిస్తున్నారు.

బిహారీ అయినందుకు సిగ్గుపడ్డా: తేజస్వి
పట్నా: బిహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ తాను బిహారీ అయినందుకు సిగ్గుపడ్డారట. కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకారం రోజున ఈ ఘటన జరిగిందంటూ ఆయనే స్వయంగా తన ట్విట్టర్ పేజీలో షేర్ చేశారు. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. తాను బెంగళూరులో ఉన్న సమయంలో చాలామంది నేతలు నితీష్‌కుమార్ మీద విమర్శలు గుప్పించారన్నారు. బీజేపీ ఎంత ప్రయత్నించినా కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు ఎవరూ అమ్ముడుపోలేదని కానీ బిహార్ ముఖ్యమంత్రి మాత్రం తనకు తాను గత సంవత్సరం కాషాయ పార్టీకి అమ్ముడుపోయారని అన్నారు. ఈ మాట అక్కడ బెంగళూరులో మనుషులే అన్నారని.. దాంతో బిహారీ అయినందుకు తాను సిగ్గుపడ్డానని చెప్పుకొచ్చారు.  అయితే దీనికి జేడీయూ కూడా దీటుగా స్పందించింది. తేజస్వి తండ్రి, ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ 1990-97 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్న తరుణంలో రాష్ట్రాన్ని దోచుకున్నారని, చివరకు పశువుల మేతను కూడా వదల్లేదని పార్టీ ప్రతినిధి సంజయ్ సింగ్ ఎద్దేవా చేశారు. 

English Title
Ishwarya rai ready to Election
Related News