ఇస్రో కెమెరా కంటికి భూమి ఫొటోలు

Updated By ManamWed, 03/21/2018 - 12:57
ISRO camera started working
  • ఆకాశం నుంచి ఫొటోలు పంపుతున్న ఎంఎంఎక్స్-టీడీ

ISRO camera started working

చెన్నై: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇటీవల అంతరిక్షంలోకి పంపించిన ఐఎన్ఎస్-1సీ ఉపగ్రహంలోని సూక్ష్మ కెమెరా తన పని చేసేస్తోంది. దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ కెమెరా భూమిని ఫొటోలు తీసి కిందకు పంపిస్తోంది. భూమి హై రెజల్యూషన్ ఫొటోలను ఇస్రోకు చేరవేస్తోంది. 2018 జనవరి 16 నుంచి ఐఎన్ఎస్-1సీతో పాటు పంపిన మినియేచర్ మల్టీ స్పెక్ట్రల్ టెక్నాలజీ డిమాన్‌స్ట్రేషన్ (ఎంఎంఎక్స్-టీడీ) తన పనిని ప్రారంభించింది. అప్పటి నుంచి గ్రౌండ్ స్టేషన్‌కు భూమి తాలూకు చిత్రాలను పంపిస్తోంది. ఈ చిత్రాల ఆధారంగా భౌగోళిక పరిస్థితులు, అటవీ విస్తీర్ణం, నీటి సాంద్రత, మేఘాలపై అధ్యయనం చేసేందుకు వీలు చిక్కుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఒరిగామి ఆప్టిక్స్ (మల్టీ ఫోల్డ్ రిఫ్లెక్టివ్ (ప్రతిబింబన) ఆప్టిక్స్) ద్వారా ఈ కెమెరాను రూపొందించామని ఇస్రో అధికార వర్గాలు చెబుతున్నాయి. సంప్రదాయ పరావర్తన కెమెరాల కన్నా ప్రతిబింబన కెమెరాలు ఫొటోల మందాన్ని తగ్గిస్తాయని చెబుతున్నారు. ఆర్జీబీ రంగుల్లో 505 కిలోమీటర్ల ఎత్తు నుంచి 23 మీటర్ల వైశాల్యంతో 29ఎం/29ఎం ఫొటోలను తీసి పంపుతుంది ఈ కెమెరా. ఈ కెమెరాను రోబస్ట్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కింద స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ ఆఫ్ ఇస్రో రూపొందించింది. 

ISRO camera started working

 

English Title
ISRO camera started working
Related News