పారితోషికంపై అమీర్ ఖాన్ క్లారిటీ...

Updated By ManamWed, 03/14/2018 - 20:47
aamir khan
aamir khan

తాను ఒక్కో సినిమాలో నటించేందుకు ఎంత పారితోషికం తీసుకుంటారో బాలీవుడ్ నటుడు క్లారిటీ ఇచ్చారు. కొన్ని ఏళ్ల క్రితమే తాను ఒక్కో సినిమాకు కొంత మొత్తాన్ని పారితోషికంగా తీసుకోవడం మానేసినట్లు చెప్పారు. సినిమా సాధించే కలెక్షన్ల ఆధారంగానే తన ఆదాయం ఉంటోందని చెప్పుకొచ్చారు. తాను నటించిన సినిమా సరిగ్గా కలెక్షన్లు సాధించకుంటే, తన ఆదాయం కూడా తక్కువగానే ఉంటుందని...ఎక్కువ కలెక్షన్స్ సాధిస్తే ఎక్కువ ఆదాయం ఉంటుందని వివరించారు. బాలీవుడ్ చిత్ర పరిశ్రమను గట్టెక్కించేందుకు హీరోలు తమ పారితోషికాన్ని తగ్గించుకోవాలన్న సలహాపై స్పందిస్తూ బుధవారం 53వ జన్మదినాన్ని జరుపుకున్న అమీర్ ఖాన్ ఈ కామెంట్స్ చేశారు. 

English Title
It has been years since I have stopped charging fee: Aamir Khan
Related News