అవసరమైతే చంద్రబాబు ప్రచారం..

Updated By ManamSun, 09/09/2018 - 16:38
l ramana comment on  telangana assembly elections
L ramana comment on telangana assembly elections

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అవసరం అయినచోట టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాల్గొంటారని టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ తెలిపారు. ఆదివారం తెలంగాణ టీడీపీ నేతల భేటీ ముగిసిన అనంతరం ఎల్ రమణ మీడియాతో మాట్లాడారు. ‘పొత్తులు, సీట్ల కేటాయింపు విషయంలో కొంచెం ఇబ్బంది అయినా పట్టువిడుపులు ఉంటాయి. 

కాంగ్రెస్ సహా కలిసివచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని సూచించాం. పొత్తులపై మా ప్రతిపాదనకు చంద్రబాబు ఆమోదం తెలిపారు. నిర్ణయాలు తీసుకునే పూర్తి స్వేచ్ఛ అధినేత  మాకు ఇచ్చారు. కాంగ్రెస్‌తో పొత్తుపై టీడీపీ శ్రేణులు అర్థం చేసుకుంటారు. అవసరం అయితే చంద్రబాబు ప్రచారంలో పాల్గొంటారు’ అని ఆయన తెలిపారు.

కాగా ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ టీడీపీ ఆదివారం మూడు కమిటీలు ఏర్పాటు చేసింది. ఎన్నికల సమన్వయ కమిటీ, మేనిఫెస్టో కమిటీ, ప్రచార కమిటీలను నియమించింది.  ఎన్నికల సమన్వయ కమిటీలో ఎల్. రమణ, దేవేందర్ గౌడ్, రావుల, నామా నాగేశ్వరరావు, రేవూరి, పెద్దిరెడ్డి, మండవను నియమించగా, మేనిఫెస్టో కమిటీలో దేవేందర్ గౌడ్, రావుల చంద్రశేఖర్, బి. నర్సింహులు, అలీ మస్కటి, శోభారాణిని నియమించారు. అలాగే ప్రచార కమిటీల నియామకంలో గరికపాటి, సండ్ర , కొత్తపేట, అరవింద్ కుమార్ గౌడ్, లక్ష్మణ్ నాయక్ రమావత్‌ నియమితులయ్యారు.

English Title
Is it necessary chandrababu naidu to campaign in telangana elections, says l ramana
Related News