జాబిల్లి టూరిస్టు జపాన్ వాసి!

Updated By ManamWed, 09/19/2018 - 00:52
 Space exp
  • తొలి అవకాశం దక్కించుకున్న యుసాకు

  • అధికారికంగా ప్రకటించిన ఎలాన్ మస్క్

  • 2023లో చంద్రుడిని చుట్టిరానున్న ‘స్పేస్ ఎక్స్’

 Jabilli tourist japan!టోక్యో: జాబిల్లి చుట్టూ తొలిసారిగా ఎవరు తిరిగి రానున్నారు? ఆ అవకాశం జపాన్‌కు చెందిన ఓ కోటీశ్వరుడికి దక్కింది. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ప్రముఖ సంస్థ స్పేస్ ఎక్స్.. చంద్రుని చుట్టూ పర్యాటకులను తిప్పే ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే. 2023లో ఈ ప్రయోగం చేయనున్నారు.  జపాన్‌కు చెందిన ఆన్‌లైన్ వ్యాపార దిగ్గజ సంస్థ  జోజోటైన్ సీఈవో యుసాకు మెజావా ఈ తొలి అవకాశాన్ని దక్కించుకున్నారు. ఇ ఈ విషయాన్ని స్పేస్‌ఎక్స్ సంస్థ స్వయంగా వెల్లడించింది.యుసాకుతో దిగిన ఫొటోను స్పేస్ ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ తన ట్విటర్ ఖాతాలో పంచుకున్నారు. ఇందులో యుసాకును ఎలాన్ మస్క్ తన భుజాలపై ఎత్తుకున్నారు. అయిత ఈ పర్యటనకు ఆయన ఎంతచెల్లించనున్నారనే విషయాన్ని ఆయన వెల్లడించలేదు.  ‘యుసాకు చాలా ధైర్యవంతుడు. చంద్రుడి పర్యటనకు ఆయన ముందుకు రావడం గర్వంగా ఉంది’ అని మస్క్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా యుసాకు మాట్లాడుతూ.. ‘చిన్నప్పటి నుంచి నాకు చంద్రుడు అంటే చాలా ఇష్టం. ఇది నా చిరకాల కోరిక’ అని ఆనందం వ్యక్తం చేశారు. తనతో పాటు ఆరు నుంచి 8 మంది ఆర్టిస్టులను కూడా చంద్రుడి పర్యటనకు తీసుకెళ్లాలని అనుకుంటున్నానని చెప్పారు.ఫోర్బ్స్ జాబితా ప్రకారం జపాన్‌లోని అత్యంత ధనవంతుల జాబితాలో యుసాకు 18వ స్థానంలో ఉన్నారు. యుసాకు ఆస్తుల విలువ  3 బిలియన్ డాలర్లు. భారత కరెన్సీలో రూ. 21వేల కోట్లకు పైమాటే. భారీ వాహక నౌక అయిన బిగ్ ఫాల్కన్ రాకెట్(బీఎఫ్‌ఆర్) ద్వారా పర్యాటకులను చంద్రుని వద్దకు ఈ కంపెనీ తీసుకెళ్లనుంది.

Tags
English Title
Jabilli tourist japan!
Related News