అలీబాబా సంచలన నిర్ణయం

Updated By ManamSat, 09/08/2018 - 13:35
Jack Ma

Jack Maబీజింగ్: చైనా అత్యంత సంపన్నుడు, అలీబాబా సహ వ్యవస్థాపకుడు, చైర్మన్ జాక్ మా సంచలన నిర్ణయం తీసుకున్నారు. సోమవారం జాక్ మా 54వ పుట్టినరోజు కాగా.. ఆ రోజున తాను రిటైర్‌మెంట్ తీసుకోనున్నట్లు ప్రకటించారు. విరమణ ముగింపు కాదని, మరో శకానికి ప్రారంభం అని తెలిపిన జాక్ మా.. తన తదుపరి సమయాన్ని ఫిలాంత్రఫీ కోసం కేటాయిస్తానని జాక్ మా వెల్లడించారు.

అయితే ఇంగ్లీష్ టీచర్ అయిన జాక్ మా.. 1999లో ఇ-కామర్స్ రంగంలోకి అడుగుపెట్టి అలీబాబా సంస్థను స్థాపించారు. తక్కువ కాలంలో ఈ సంస్థ వేగంగా అభివృద్ధి చెంది బిలియన్ డాలర్ల కంపెనీగా అవతరించింది. ఆ తరువాత 2013లో సీఈవో పదవి నుంచి తప్పుకున్న జాక్ మా.. ఆ తరువాత నుంచి కంపెనీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ తనకు ఆదర్శమని, బిల్‌గేట్స్ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇంకా సంపన్నుడిగా ఎదగాలని కాదు. ముందుగానే రిటైర్ అవ్వాలని అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన జాక్ మా.. తాజాగా రిటైర్‌మెంట్ ప్రకటించి, అందరికీ షాక్ ఇచ్చాడు.

English Title
Jack Ma to retire on Monday
Related News