213వ రోజు జగన్ యాత్ర సాగనుందిలా..

Updated By ManamMon, 07/16/2018 - 09:57
jagan

jagan  అనపర్తి: ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 213వ రోజు ప్రారంభమైంది. వర్షం కారణంగా ఆదివారం యాత్ర రద్దు కాగా నేడు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో మామిడాల శివారు నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి పెద్దడ, కికవోలు, పెద్దపూడి, దొమ్మాడ మీదుగా కరుకుడురు వరకు జగన్ పాదయాత్రను కొనసాగించనున్నారు. మరోవైపు జగన్‌ను కలిసేందుకు అభిమానులు, కార్యకర్తలు వేలాదిగా యాత్రకు తరలివస్తున్నారు. ఈ సందర్భంగా వారు జగన్‌తో కలిసి అడుగులు వేస్తున్నారు.

English Title
Jagan padayatra reached 213th day
Related News