జగన్ పాదయాత్రకు బ్రహ్మరథం

Updated By ManamTue, 09/04/2018 - 22:36
jagan

jaganకె.కోటపాడు: ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నంలో కొనసాగుతుంది. 254వ రోజు మంగళవారం ఉదయం జోగన్నపాలెం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. రామచంద్రాపురం, బొట్టవానిపాలెం, కె.సంతపాలెం, చంద్రయ్యపేట, అయ్యన్నపాలెం మీదుగా బుద్దిరెడ్డిపాలెం క్రాస్ వరకు వరకు యాత్ర కొనసాగింది. జగన్ పాదయాత్రకు ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు పలికారు. పాదయాత్రలో భాగంగా రామచంద్రాపురం చేరుకున్న జగన్‌ను కలిసిన రైవాడ రిజర్వాయర్ ఆయకట్టు రైతులు తమ సమస్యలను విన్నవించుకున్నారు. జీవీఎంసీ నీటి సరఫరా (రైవాడ కాలువ) లస్కర్లు కూడా జగన్‌ను కలిశారు. అవుట్ సోర్సింగ్ విధానంలో జీవీఎంసీలో 21 ఏళ్ల నుంచి పని చేస్తున్నామని తమ సర్వీసును క్రమబద్దీకరించాలని జగన్‌ను కోరారు. బొట్టవానిపాలెం మీదుగా పాదయాత్రగా కె.సంతపాలెం చేరుకున్న జగన్‌ను పలువురు విద్యార్థులు కలిశారు. ఫీజు రియింబర్స్‌మెంట్, మధ్యాహ్న భోజనం తదితర అంశాల్లో తాము ఎదుర్కొంటున్న సమస్యలను చెప్పుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సీపీఎస్ విధానం రద్దు చేస్తామని వైఎస్ జగన్ చేసిన ప్రకటన పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పలువురు ఉద్యోగుల సంఘం నేతలు జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక నేతలు పలువురు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. పాదయాత్రలో వైసీపీ విశాఖ జిల్లా నేతలు గుడివాడ అమర్‌నాథ్, అదీప్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.

వైసీపీలోకి డాక్టర్ పీవీ రమణమూర్తి
‘కళా’ ఆసుపత్రి అధినేత, సామాజికవేత్త డాక్టర్ పీవీ రమణమూర్తి వైఎస్‌ఆర్‌సీపీలో చేరుతున్నారు. ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న పీవీ.రమణమూర్తి ప్రజలకు మరింత చేరువ కావడం కోసం రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. పార్టీలో చేరాలని వైసీపీ నుంచి కూడా ఆహ్వానం అందడంతో జగన్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. వైసీపీ అధినేత జగన్ సమక్షంలో బుధవారం ఆయన పార్టీలో చేరనున్నారు.

English Title
Jagan's padamrathra
Related News