జైట్లీ మళ్లీ వస్తున్నారు

Updated By ManamFri, 08/03/2018 - 23:44
jaitley
  • త్వరలో ఆర్థిక శాఖ బాధ్యతలు

  • కుదుటపడ్డ కేంద్ర మంత్రి ఆరోగ్యం

  • కిడ్నీ మార్పిడి తర్వాత విధుల్లోకి..

  • మూడు నెలలుగా శాఖకు దూరం

jaitleyన్యూఢిల్లీ: కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స కారణంగా వల్ల మూడు నెలలు విధులకు దూరంగా ఉన్న కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ త్వరలో ఆర్థిక శాఖ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నెల రెండో వారంలో ఆయన ఆర్థిక శాఖ పగ్గాలు చేపడతారని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆర్థిక మంత్రిగా అరుణ్ జైట్లీ బాధ్యతలు చేపట్టారు. ఇటీవల ఆయన అస్వస్థతకు గురవడం, కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరగడంతో విధులకు దూరమయ్యారు. వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో మేలో రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్‌కు అదనంగా ఆర్థిక శాఖ బాధ్యతలను తాత్కాలికంగా అప్పగించారు. కాగా జైట్లీ కోలుకోవడంతో మళ్లీ ఆర్థిక బాధ్యతలు చేపట్టనున్నారు. నార్త్ బ్లాక్‌లోని జైట్లీ కార్యాలయంలో మరమ్మత్తులు చేపట్టారు. ఆయనకు ఎలాంటి ఇన్ఫెక్షన్లు సోకకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. విధులకు దూరంగా ఉన్న ఆర్థిక శాఖకు సంబంధించిన అంశాలపై సోషల్ మీడియా ద్వారా ఆయన స్పందిస్తున్నారు. 

English Title
Jaitley is coming back again
Related News