జనసేన తొలి ఎమ్మెల్యే అభ్యర్థి పితాని బాలకృష్ణ

Updated By ManamTue, 09/11/2018 - 17:32
Pawan Kalyan announces Jana Sena first mla candidate pitani balakrishna
Jana Sena Mummidivaram mla candidate is Pitani Balakrishna

హైదరాబాద్ : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం అభ్యర్థిని జనసేన పార్టీ ప్రకటించింది. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం‌ స్థానాన్ని పితాని బాలకృష్ణకు కేటాయించినట్లు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.  కాగా జనసేన తరఫున రాష్ట్రంలోనే మొట్టమొదటిగా అభ్యర్థిగా బాలకృష్ణకు సీటు కేటాయింపు జరిగింది. 

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... ‘పితాని బాలకృష్ణ బలమైన అభ్యర్థి. అతడు పోలీస్ కానిస్టేబుల్. మా తండ్రి కూడా పోలీస్ కానిస్టేబుల్... నాన్నపై ప్రేమతో ముమ్మిడివరం నుంచి పితాని పేరు ప్రకటించడం జరిగింది.’ అని అన్నారు. కాగా ఇటీవల జిల్లాలో పవన్ పర్యటన సందర్భంగా పితాని బాలకృష్ణ ..జనసేన పార్టీలో చేరారు. అంతకు ముందు ఆయన వైఎస్సార్ సీపీలో ఉన్నారు. ఆ తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. కాగా జిల్లాలో పట్టున్న శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన పితాని బాలకృష్ణకు ఎమ్మెల్యే అభ్యర్థిగా తొలి టికెట్‌ను కేటాయించడం పట్ల ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Jana Sena first candidate is pitani Balakrishna

 

English Title
Jana Sena Mummidivaram mla candidate is Pitani Balakrishna
Related News