జైట్లీకి జనసేనాని సూటి ప్రశ్న..

Updated By ManamWed, 03/14/2018 - 18:51
Janasena Chief Pawan

janasena sabha


గుంటూరు: భారత్ మాతాకి జై అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ఈ సభా వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కడిగిపారేశారు.! ప్రత్యేక హోదా గురించి పవన్ మాట్లాడుతూ కేంద్రంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్రానికి అర్థమయ్యే లాగా ఇంగ్లీష్‌లోనే పవన్ మాట్లాడారు.

" సమస్యలపై పోరాటం చేయడం నాకిష్టం. భావితరాల కోసం ఏ సంపద విడిచిపెట్టాం.. యుద్దం, కన్నీరు, పిరికితనం, మోసం తప్ప. కేంద్రం అంటే మనవారికి భయం, పిరికితనం. దోపిడి చేసేవారికే పిరికితనం.. మనకెందుకు భయం. కేంద్ర ప్రభుత్వమంటే మనవాళ్లకి భయం.. కానీ నాలాంటి వాళ్లకు భయం లేదు. సీఎం చంద్రబాబుకు వైసీపీ అధినేత జగన్‌కు వాళ్ల భయాలు వాళ్లకు ఉండవచ్చు. సీబీఐ కేసులు పెడతారని మీకు( చంద్రబాబు, జగన్‌ను ఉద్దేశించి) మిగతావారికి భయం ఉండొచ్చు" అని సభా వేదికగా పవన్ చెప్పుకొచ్చారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ సందర్భంగా సూటి ప్రశ్న సంధించారు.

అరుణ్ జైట్లీగారూ..
"
నేను పవన్ కల్యాణ్‌ను.. అమరావతి నుంచి మాట్లాడుతున్నాను. నాలుగేళ్ల నుంచి ఏపీకి జరుగుతున్న అన్యాయం మమ్మల్ని బాధపెట్టింది. సెంటిమెంట్‌తో ప్రత్యేక హోదా ఇవ్వలేమన్నారు. అదే తెలంగాణతో తెలంగాణ ఎలా ఇచ్చారు?.మీ కాకినాడ ప్రకటన అనుగుణంగా రాష్ట్రాన్ని విడదీశారు. ఒక ఓటు రెండు రాష్ట్రాలు అనే తీర్మానం చేశారు. అవును ప్రత్యేక హోదా అనేది ఓ సెంటిమెంటే. మీ ప్రకటన మా గుండెల్ని మండిస్తోంది. అప్రస్వామికంగా రాష్ట్రాన్ని విడదీశారు.

మేము ఎందుకు మీ చట్టాలను పాటించాలని సూటిగా ప్రశ్నిస్తున్నాను. చట్టాలు మాకే కానీ మీకు కాదా?. మీరు గౌరవించని చట్టాల్ని మేమేందుకు గౌరవించాలి?. విభజించేటప్పుడు హోదా ఇస్తామన్నారు. పాతికమంది ఎంపీలతో కేంద్రం 5కోట్ల మందిని కంట్రోలు చేయాలనుకుంటోంది. తెలుగు ప్రజల, ఆంధ్రుల ఆత్మగౌరవంకోసం కేంద్రాన్ని నిలదీయాలి. హోదా అనేది డబ్బుల సమస్య మా ఆత్మగౌరవ సమస్య.  హోదా ఇవ్వకపోతే రహదారులు దిగ్భందిస్తాం. మీరే మమ్మల్ని ఈ పరిస్థితుల్లోకి నెట్టారు" అని పవన్ ఆగ్రహంతో చెప్పారు.

English Title
Janasena Chief Pawan Question To Central Minister Jaitley
Related News