సభా ప్రాంగణానికి చేరుకున్న జనసేనాని 

Updated By ManamWed, 03/14/2018 - 18:00
Janasena sabha

janasenani

గుంటూరు: జనసేన అధినేత పవన్ కల్యాణ్ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. సరిగ్గా 5: 50 గంటలకు పవన్ ప్రాంగణానికి వచ్చారు. అంతకముందు భారీ సెక్యూరిటీ మధ్య తాను బస చేసిన హోటల్ నుంచి సభకు బయల్దేరారు. పవన్ రాకతో కార్యకర్తలు, అభిమానులు కేకలు, ఈలలు, నినాదాలతో హోరెత్తించారు. పవన్ సీఎం.. పవన్ సీఎం అంటూ జనసైనికులు నినాదాలు చేశారు. ఇదిలా ఉంటే సభ వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. సభకు తెలుగు రాష్ట్రాల నుంచి అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. 

English Title
Janasena chief Reached JanaSena Party Formation Day Maha Sabha
Related News