ఆ తల్లి మిమ్మల్ని వదిలిపెట్టదు.. !: పవన్

Updated By ManamWed, 03/14/2018 - 22:32
pawan kalyan on tdp

ఆ తల్లి మిమ్మల్ని వదిలిపెట్టదు.. !: పవన్అమరావతి: జనసేన ఆవిర్భావ దినోత్సవ మహాసభ వేదికగా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. టీడీపీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు." అయ్యా ముఖ్యమంత్రి గారూ.. సింగపూర్ తరహా రాజధాని కడతామంటారు.. అలాంటి పాలన కూడా కావాలి. సింగపూర్‌కు చెందిన దివంగత నేత లీక్ వాన్ యూ అందరికీ ఆదర్శంగా ఉంటారు. ఆయన కేబినెట్లో కేవలం సింగపూర్ వాళ్లే కాకుండా అన్ని జాతుల వారూ ఉంటారు. ఇక్కడ బతికే విదేశీయులు కూడా మన సింగపూరోళ్లే అనే భావాన్ని అందరికీ తెప్పించిన మహానుభావుడు. అవినీతి చేసినట్లు తెలిస్తే ఆయన ఊరుకోరు.. ఆఖరికి ప్రాణానికి ప్రాణమైన స్నేహితుడ్ని సైతం జైల్లో పెట్టించారు. మహిళా అధికారి మీద దాడిచేస్తుంటే(వనజాక్షిపై దాడిని ఉద్దేశించి) .. మీరు ఇక్కడేం చేస్తున్నారు.. ! ఇదే దాడి సింగపూర్‌లో జరిగుంటే ఆ వ్యక్తికి తోలు ఊడిపోయేలా కొట్టేవాళ్లు. కానీ మహిళను కొడితే వాళ్లను(టీడీపీ ఎమ్మెల్యేలను) మీరు (చంద్రబాబు) వెనకేసుకొస్తారెందుకనీ? అది మీకు న్యాయమా? అసలు శాంతిభద్రతలు ఎక్కడున్నాయ్?.

అభివృద్ధికి జనసేన పార్టీ వ్యతిరేకం కాదు. నేను ఆరేళ్లలో 75 కోట్ల రూపాయిలు సంపాదించాను..పాతికకోట్లపైనే పన్ను కట్టాను. అభివ‌ృద్ధంటే ఏంటో.. పారిశ్రామికవేత్తల విలువ చాలా తెలుసు. ఇవాళ ప్రతి ఒక్కరి దగ్గరా (నేతలు) వేలకోట్ల డబ్బులు మూలుగుతోంది. ఇసుక అంటారు.. డబ్బులు తీసుకెళ్లి జేబులో పెట్టుకుంటారు.. ఆ ఇసుక ఎవడిది? భూదేవిది కాదా?. అలాంటి భూమాతను మీరు అడ్డగోలుగా తవ్వేస్తున్నారు.. ఆ తల్లి ఊరుకుంటుందా? అలా చేసే వారందర్నీ భూమీలోకి లాక్కెళ్లిపోతుంది భూతల్లి. మీరు నమ్మకన్ని వంచించారు గనుక మిమ్మల్ని భూమాత వదిలిపెట్టదు. ప్రజలను కంటికి రెప్పలా చూసుకోని ప్రభుత్వాలపై ఎదురు తిరుగుతానే తప్ప.. నేను అసలు స్నేహం చేయను" అని పవన్ కల్యాణ్ సభలో తేల్చిచెప్పారు.

English Title
Janasena Chief Sensational Comments On TDP
Related News