ఒకే ఒక్క మిస్డ్ కాల్‌తో జనసేన సభ్యత్వం

Updated By ManamWed, 03/14/2018 - 22:52
Janasena Membership Number

ఒకే ఒక్క మిస్డ్ కాల్‌తో జనసేన సభ్యత్వం

గుంటూరు: ఒకే ఒక్క మిస్డ్ కాల్‌తో జనసేన సభ్యత్వం పొందవచ్చని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. 93940 22 222‌ కి మిస్ట్ కాల్ ఇస్తే చాలు జనసేన మెంబర్ అవుతారని ఆయన చెప్పారు. సభ్యత్వం గురించి చాలా మంది ఏం చేద్దామని అడిగారనీ.. సమయం వచ్చినప్పుడు చెబుతా అన్నానని పవన్ సభలో తెలిపారు. సులువుగా ఉండేందుకు జనసేన టెక్ టీం వినూత్నమైన విధానానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి చాలంతే.. ఆ తర్వాత మీకిష్టమైతే వివరాలు ఇవ్వండి లేకుంటే వదిలేయండన్నారు. ‘మీకు నాకు ఒక్క మిస్డ్ కాల్ దూరం అంతే’ అని పవన్ చెప్పారు.

English Title
Janasena Membership Number | Give A Missed Call For Janasena Party Membership
Related News