కాసేపట్లో జనసేన ఆవిర్భావ సభ ప్రారంభం

Updated By ManamWed, 03/14/2018 - 16:20
Janasena

janasena

గుంటూరు: జిల్లాలోని ఏఎన్‌యూ ఎదుట జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ జరగనున్న సభ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఈ సభకు భారీగా పవన్ అభిమానులు, జనసైనికులు హాజరయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా అభిమానులు గుంటూరు తరలివెళ్లారు. సరిగ్గా ఐదుగంటలకు పవన్ వేదికపైకి రానున్నారు. మరోవైపు సభలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్దఎత్తున పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. భద్రత కోసం పవన్ మంగళవారం నాడు ఏపీ డీజీపీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే.

English Title
JanaSena Party Formation Day Maha Sabha
Related News