అంబేద్కర్ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తాం

Updated By ManamSat, 04/14/2018 - 11:57
Pawan

Pawan  హైదరాబాద్: జై హింద్ అనే మాట జాతి స్ఫూర్తిని ఎలా రగిలిస్తుందో.. జై భీం అనే నినాదం భారతదేశంలో సమానత్వం ఆవశ్యతకతని తెలుపుతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించిన పవన్ కల్యాణ్.. అంబేద్కర్ ఆశించిన సామాజిక సమానత్వ సాధనకు జనసేన పార్టీ ఎల్లవేళలా కృషి చేస్తుందని అన్నారు. జనసేన కార్యకర్తలకు నిర్వహించే శిక్షణ శిబిరాల్లో అంబేద్కర్ గారు చెప్పిన రాజ్యాంగ స్ఫూర్తి, ఆయన భావాలు చట్టం రూపకల్పనకు అనుసరించాల్సిన విధానాలు పాఠాలుగా చెబుతామని అన్నారు.

ఇక చిత్తశుద్ధితో, త్రికరణ శుద్ధితో అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళతామని.. లండన్ వెళ్లినప్పుడు అంబేద్కర్ గారు నివసించిన ఇంటిని సందర్శించే భాగ్యం తనకు కలిగిందని తెలిపారు. అయితే ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టంపై ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు బాధాకరమని, ఈ విషయంలో సుప్రీం మరోసారి ఆలోచన చేయాలని పేర్కొన్నారు. 
 

జనసేన కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు: ఫొటోల కోసం కింది లింక్ క్లిక్ చేయండి.

 http://www.manamnews.com/node/14322

English Title
JanaSena strives to take forward the ambitions of Ambedkar
Related News